లక్కిఛాన్స్ కొట్టేసిన బుట్టబొమ్మ !

- Advertisement -

పూజా హెగ్దే.. నాగ చైత‌న్య హీరోగా న‌టించిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్ వెండితెర‌కు ప‌రిచ‌య‌మైంది. అతిత‌క్కువ కాలంలోనే అగ్ర‌హీరోల‌తో న‌టించి.. టాప్ హీరోయిన్‌గా కొన‌సాగుతోంది ఈ బుట్ట‌బొమ్మ‌. త‌న అందం, అభినయంతో వెండితెర‌పై అద‌ర‌గొట్టే ఈ ముద్దుగుమ్మ‌కు ప్ర‌స్తుతం వ‌రుస ఆఫ‌ర్లు వెల్లువెత్తుతున్నాయి.

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటేడ్ క‌థానాయిక ఎవ‌రైనా ఉన్నారా? అంటే అందులో బుట్ట‌బొమ్మ పూజ హెగ్దే ముందువ‌రుస‌లో ఉంటుంది. ఇటీవ‌లే పాన్ ఇండియా సినిమాగా తెర‌కెక్కిన ‏’రాధేశ్యా‌మ్’ మూవీలో ప్ర‌భాస్‌కు జోడీగా న‌టించింది. ఈ చిత్రం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుపుకుంటూ విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. అలాగే, భారీ బ‌డ్జెట్‌తో తీస్తున్న మెగాస్టార్ చిరు మూవీ ‘ఆచార్య’‌లో చ‌ర‌ణ్‌కు జోడీగా పూజాహెగ్దే న‌టిస్తోంది.

- Advertisement -

తాజాగా ఈ అమ్మ‌డు మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసిన‌ట్టు స‌మాచారం. సూప‌ర్ స్టార్, టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ల కాంభినేష‌న్ లో త్వ‌ర‌లోనే ఓ సినిమా తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. యాక్ష‌న్ అండ్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రాబోతున్న ఈ చిత్రంలో సూప‌ర్ స్టార్ స‌ర‌స‌న న‌టించే అవ‌కాశం పూజా హెగ్దేకు ద‌క్కింద‌ని టాలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. త్వ‌ర‌లోనే దీనిని సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న రానుంద‌ని స‌మాచారం.

నాగ చైతన్య ‘లవ్ స్టోరీ’కి బ్రేకులేసిన కరోనా

79 వేల మంది చిన్నారులకు కరోనా

సూప‌ర్ స్టార్ మ‌హేశ్ నెక్స్ట్ మూవీ ఆయ‌న‌తోనేనా !

‘వకీల్ సాబ్’ హీరోయిన్ కు కరోనా

ఢిల్లీని వీడుతున్న ప్ర‌జ‌లు.. ఎందుకంటే..?

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -