మాస్ రాజా రవితేజ అంటే ఒకప్పుడు మినిమమ్ గ్యారెంటీ హీరో ,కాని ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.సరైన హిట్లు లేక సినిమాను కొనేవారు లేరని తెలుస్తుంది.పరాజయాలు ఎంతటి స్టార్ హీరోనైనా ఇబ్బందుల్లో నెట్టేస్తాయనే దానికి రవితేజ ఉదాహరణ. వివరాల్లోకి వెళితే రవితేజ హీరోగా దర్శకుడు శ్రీనువైట్ల ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమా రూపొందించాడు.అటు శ్రీనువైట్లకి వరుస ఫ్లాప్ లు ఉండడం, మరోపక్క రవితేజకి వరుసగా రెండు పెద్ద డిజాస్టర్ లు ఈ ఏడాదిలోనే రావడంతో వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా కొనడానికి బయ్యర్లు ఆసక్తి చూపడం లేదు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ ని చూసి కొందామని అనుకున్నప్పటికీ బయ్యర్లు మాత్రం ఈ కాంబినేషన్ లో సినిమా అంటే జంకుతున్నారు.
లోకల్ బయ్యర్ల పరిస్థితే ఇలా ఉందంటే.. ఇక ఓవర్సీస్ లో ఈ సినిమాని కొనడానికి ఒక్కరు కూడా ముందుకు రాకపోవడం గమనార్హం. ఒకప్పుడు శ్రీనువైట్ల సినిమాలకి ఓవర్సీస్ లో మార్కెట్ ఓ రేంజ్ లో జరిగేది. కానీ ఇప్పుడు ఆయన సినిమాను కొనే పరిస్థితి లేకుండా పోయింది. మరి నిర్మాతలు ప్రీరిలీజ్ బిజినెస్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో చూడాలి.వరుస హిట్లతో క్రేజ్ తెచ్చుకున్న రవితేజకి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో ఎవ్వరికి అర్థం కావడం లేదు.ఇక సినిమాతో చాలా రోజులు తరువాత ఇలియానా తెలుగులో నటించింది.
