పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పై ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ మండిపడ్డారు. తాను పోస్ట్ చేసిన ఓ కవిత… పవన్ కల్యాణ్ ను ఎలా టార్గెట్ చేస్తుందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మీపని మీరు చూసుకోవాలని… తన సోషల్ మీడియాలోకి ఎంటరై, ఎదో ఒకటి పోస్ట్ చేస్తూ, తనను కామెంట్ చేయవద్దని అన్నారు. ఈ ట్వీట్ ను కూడా మీరు రాద్ధాంతం చేస్తారనే విషయం తనకు తెలుసని చెప్పారు.
గతంతో కూడా పవన్ అభిమానులు రేణూపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో అవి పెద్ద దుమారాన్నే లేపాయి. ఇప్పుడు మరోసారి రేణూను టార్గెట్ చేశారు పవన్ అభిమానులు. అంతే రీతిలో ఘాటుగా రిప్లై ఇచ్చింది రేణూ. ఆమె ఇంతగా ఆగ్రహం చెండానికి పవన్ అభిమాలు కొందరు చేసిన కామెంట్లే.
మీ వల్లే పవణ్ కల్యాణ్ రాజకీయ పార్టీలకు టార్గెట్ అవుతున్నారని ట్వీట్ చేశారు. సగం నాలెడ్జ్ తో మీరు ట్వీట్లు చేస్తారని… మీరు ఏదో చెబితే, మీడియా దాన్ని పూర్తిగా హైలైట్ చేస్తోందని విమర్శించారు. దయచేసిన తమరి పని తమరు చేసుకోవాలని… పవన్ గురించి ఎలాంటి విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని కోరారు. దీంతో, ఆమె తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ట్విట్టర్ ద్వారా ఘాటుగా స్పందించారు.
Seriously? How is it possible that he becomes a “target” because of a poem of mine? You guys should do your work and not come to my social media every time I post something & be rude to me! Yes,go on&all of you make an issue out of this tweet of mine too🙄 https://t.co/464SjFeIbZ
— renu (@renuudesai) March 3, 2018
