Saturday, April 20, 2024
- Advertisement -

వర్మ ట్వీట్లు.. ఈ సారి కొంచెం అర్థవంతంగానే ఉన్నాయ్..!

- Advertisement -

అనునిత్యం వివాదాస్పద ట్వీట్లను పెడుతూ… వివాదాలను రగిల్చే ప్రయత్నం చేసే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ..

ఈ మధ్య కాలంలో తొలిసారి అర్థవంతంగా స్పందించాడు. వివాదాస్పద రీతిలోనే మాట్లాడుతూ… వర్మ అర్థవంతమైన విషయాలను ప్రస్తావించాడు. ఒకవైపు సెలబ్రిటీలు గ్రామాలను దత్తత తీసుకుంటున్న నేపథ్యంలో వర్మ ఘాటైన ట్వీట్లను పెట్టాడు. చిన్న తారలూ ఒకే గ్రామాన్ని దత్తతతీసుకుని.. పెద్ద తారలూ ఒకే గ్రామాన్ని దత్తత తీసుకోవడం అర్థంలేని వ్యవహారం అని వర్మ అన్నాడు. అలాగే ఇలా గ్రామాలను దత్తత తీసుకొనే కాన్సెప్టే గ్రామీణులను అవమానపరచడం అవుతుందని వర్మ అభిప్రాయపడ్డాడు. 

గ్రామాలను కాదు.. మనసుంటే నగరాల్లోని  బస్తీలను దత్తత తీసుకోవాలని వర్మ చెప్పుకొచ్చాడు. పల్లె ప్రజలు పేదరికంలో ఉన్నా.. కనీసం కాస్త శుభ్రమైన పరిసరాలు.. స్వచ్ఛమైన గాలి వాళ్లకు అందుబాటులో ఉన్నాయని వర్మ అభిప్రాయపడ్డాడు. అయితే బస్తీ వాసులకు కనీసం ఆ స్థాయి సదుపాయాలు కూడా లేవని.. హైదరాబాద్ లోని అమీర్ పేట బస్తీలు, దూల్ పేట ప్రాంతాలు అత్యంత దుర్భరంగా ఉన్నాయని వర్మ ట్వీట్ చేశాడు. అలాంటి పరిసరాలున్న ప్రాంతాలను దత్తత తీసుకోవడానికి ఎవరూ ముందుకు రారేమి? అని వర్మ ప్రశ్నించాడు.

మరి వర్మ తాజా ట్వీట్లలో రెండు రకాల వెర్షన్లున్నాయి. ఒకటి దత్తత కాన్సెప్ట్ ను ఆయన వ్యతిరేకిస్తున్నాడు. మరి దత్తత వల్ల గ్రామాలకు అంతో ఇంతో మేలు జరిగితే అది మంచిదే అనుకొంటే.. వర్మ ట్వీట్లను సమర్థించలేం. అయితే… గ్రామాల కన్నా పట్టణాల్లోని బస్తీలను దత్తత తీసుకోవాల్సిన అవసరాన్ని వర్మ నొక్కి వక్కాణిస్తున్నాడు. ఈ విధంగా చూస్తే.. వర్మ సూచన విలువైనదే అవుతుంది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -