ఆచార్య సినిమా నుంచి కాజల్ తొలగింపు.. ఎందుకంటే..?

- Advertisement -

మెగా మల్టీ స్టారర్ ఆచార్య మూవీ నుంచి కాజల్‌ను తొలగించారా ? మరి కాజల్ స్థానంలో చిరంజీవికి జోడిగా చేసేదెవరు ? ఈ ప్రశ్నలకు క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నించారు ఆ సినిమా దర్శకుడు కొరటాల శివ. మెగా స్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మెగా ప్రాజెక్టు గురించి ప్రకటించినప్పుడే.. ఇందులో కాజల్ కథానాయికగా నటిస్తోందని చిత్ర బృందం వెల్లడించింది.

తర్వాత ఆచార్య షూటింగ్‌లో పాల్గొన్న కాజల్‌ ఫోటోలు బయటకొచ్చాయి. దీంతో పాటు కాజల్, సంగీత డాన్స్‌ చేసిన లాహే లాహే సాంగ్ వీడియో విడుదల కావడంతో దానికి మంచి స్పందన వచ్చింది. ఖైదీ నంబర్ 150 తర్వాత మళ్లీ చిరంజీవి- కాజల్ కలిసి నటిస్తున్న సినిమా అనే సరికి అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. అయితే తాజాగా కాజల్‌ను ఆచార్య సినిమా నుంచి తొలగిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇటీవల విడుదల చేసిన టీజర్, ట్రైలర్‌లలోనూ కాజల్ కనిపించలేదు. సినిమా ప్రమోషన్స్‌లోనూ ఆమె పేరు వినిపించకపోవడంతో తొలగింపు వార్తలు నిజమేనన్న ప్రచారం జరిగింది.

- Advertisement -

దీనిపై తాజాగా కొరటాల శివ స్పందించారు. ఆచార్య నుంచి కాజల్‌ను తొలగించడం నిజమేనన్నారు. నక్సలిజం సిద్ధాంతాలున్న వ్యక్తికి లవ్ ట్రాక్ బాగోదనిపించిందన్నారు. హీరోయిన పాత్ర ఉండాలని ఏదో పాత్ర సృష్టించి పెద్ద హీరోయిన్‌తో చేయించడం బాగోదనిపించిందన్నారు. ఇదే విషయాన్ని తాను చిరు దృష్టికి తీసుకెళ్లానని ఆయన కథకు ఏం కావాలో అదే చేయమన్నారని కొరటాల తెలిపారు. ఈ విషయం కాజల్‌కు అర్థమయ్యేలా చెప్పాననీ.. ఆమె కూడా అర్థం చేసుకున్నట్లు ఆయన వివరించారు. అయితే లాహే లాహే సాంగ్‌లో కాజల్ కనిపిస్తుందా లేదా అన్నది తేలియాంటే మాత్రం సినిమా చూడాల్సిందేనన్నారు కొరటాల శివ.

ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్న ఆలియా

అయేషా టాకియాకు చేదు అనుభవం

ఆ ఛాన్స్ కోసం కేజీఎఫ్‌ బ్యూటీ నిరీక్షణ

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -