బాలీవుడ్ స్టార్ హీరోకి కరోనా పాజిటీవ్!

- Advertisement -

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి నానాటికీ పెరుగుతూనే ఉంది. సాధారణ ప్రజలతోపాటు సెలబ్రిటీలు, రాజకీయ నేతలు సైతం ఈ వైరస్ బారిన పడుతున్నారు. బాలీవుడ్ ప్రముఖ సినీనటుడు, గురుదాస్ పూర్ బీజేపీ ఎంపీ సన్నీ డియోల్ కొవిడ్-19 పాజిటివ్ బారిన పడ్డారు.

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కుల్లూ జిల్లాలో గత కొన్ని రోజులుగా ఉంటున్న సన్నీడియోల్ కు పరీక్షిస్తే కరోనా పాజిటివ్ అని తేలిందని హిమాచల్ ప్రదేశ్ ఆరోగ్య కార్యదర్శి అమితాబ్ అవస్థీ చెప్పారు.  64 ఏళ్ల సన్నీడియోల్‌ ఇటీవల ముంబైలో భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్నారు.

- Advertisement -

అనంతరం కుల్లూ జిల్లా మనాలీ సమీపంలోని ఫాం హౌస్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం సన్నీ డియోల్ పంజాబ్ గురుదాస్‌పూర్ ఎంపీగా ఉన్నారు.

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News

- Advertisement -
Loading...