టాలీవుడ్ లో మరో విషాదం!

- Advertisement -

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. నిర్మాత సందీప్ కొరిటాల హఠాన్మరణం చెందారు. ఆదివారం గుండెపోటుతో ఆయన కన్నుమూశారు. సుధీర్ వర్మ దర్శకత్వంలో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా వచ్చిన ‘స్వామిరారా’, పాటల రచయిత కృష్ణ చైతన్య దర్శకత్వంలో నారా రోహిత్ హీరోగా వచ్చిన ‘రౌడీ ఫెలో’ సినిమాలకు సందీప్ కొరిటాల సహ నిర్మాతగా వ్యవహరించారు.

సందీప్ కొరటాల మరణానికి సంతాపం తెలుపుతూ హీరో నారా రోహిత్, దర్శకుడు సుధీర్ వర్మ ట్వీట్లు చేశారు.  ‘నా రౌడీ ఫెలో సినిమా సహ నిర్మాత, నా శ్రేయోభిలాషి సందీప్ కొరిటాల ఇకలేరనే వార్త విని చాలా బాధపడ్డాను. ఈరోజు ఇంత బాధాకరంగా ప్రారంభమవుతుందని అనుకోలేదు. ఓం శాంతి’’ అని నారా రోహిత్ ఎమోషనల్ ట్వీట్ చేశారు.

- Advertisement -

 ‘స్వామిరారా’ దర్శకుడు సుధీర్ వర్మ కూడా సందీప్ కొరిటాల మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ‘‘నా ఆత్మీయ స్నేహితుడు సందీప్ కొరిటాల మరణవార్త విని చాలా బాధపడ్డాను. ‘స్వామిరారా’ రూపొందించడంలో మీ ప్రోత్సాహాన్ని ఎప్పటికీ మరిచిపోలేను. మీ ఆత్మకు శాంతి చేకూరాలి సోదర. నిన్ను మేం కోల్పోతున్నాం’’ అని సుధీర్ వర్మ ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఆసక్తి రేపుతున్న ఎన్టీఆర్ మాస్క్.. ధర ఎంతో తెలిస్తే షాక్!

ప్రభాస్ ‘స‌లార్’ విడుద‌ల అప్పుడే !

హిందీలోకి రీమేక్ కాబోతున్న అపరిచితుడు

ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న మాస్ మ‌హారాజా ‘క్రాక్‌’

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -

Latest News