ప్రభాస్ ‘స‌లార్’ విడుద‌ల అప్పుడే !

- Advertisement -

టాలీవుడ్ యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ వ‌రుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ఆయ‌న ప్ర‌స్తుతం భారీ బ‌డ్జెట్ సినిమాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా మారాడు. ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన బాహుబ‌లి, బాహుబ‌లి-2 సినిమాల‌లో క‌థానాయ‌కుడిగా ఓ రేంజ్ లో న‌టించిన ప్ర‌భాస్‌కు ఈ సినిమాలు ఎన‌లేని పేరును సంపాదించిపెట్టాయి.

దీంతో ఆయ‌న‌తో పాన్ ఇండియా సినిమాలు తీయ‌డానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు క్యూ క‌డుతున్నారు. దీనికి త‌గిన‌ట్టుగానే ప్ర‌భాస్ ఇండియాలోని ముగ్గురు న‌లుగురు టాప్ హీరోలు తీసుకునే స్థాయిలో రెమ్యున‌రేష‌న్‌ను తీసుకుంటున్నార‌ని సినీ వ‌ర్గాల్లో టాక్ నడుస్తోంది. అయిన‌ప్ప‌టికీ నిర్మాత‌లు ప్ర‌భాస్‌నే హీరోగా పెట్టి భారీ బ‌డ్జెట్ సినిమాలు తీయ‌డానికి రెడీ అవుతున్నారు.

- Advertisement -

ఇటీవ‌లే రాధేశ్యామ్ షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్న ప్ర‌భాస్‌.. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కేజీఎఫ్ ఫేమ్ ప్ర‌శాంత్ నీల్ డైరెక్ష‌న్‌లో స‌లార్ అనే సినిమాను చేస్తున్నాడు. ప్ర‌స్తుతం రామ‌గుండంలోని కోల్ మైన్స్ లో ఈ చిత్రం షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ సినిమాను వ‌చ్చే ఏడాది (2022) ఏప్రిల్ 14న విడుద‌ల చేయ‌నున్న‌ట్టు తాజాగా చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. కాగా, ఈ సినిమాలో ప్ర‌భాస్ స‌ర‌స‌న ప్ర‌ముఖ హీరోయిన్ శృతి హాస‌న్ న‌టిస్తోంది. తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, హిందీ స‌హా ప‌లు భాష‌ల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

బాక్సింగ్ రింగులోకి రాశిఖన్నా! అందుకేనా..

‘పైన పటారం.. లోన లోటారం’ అంటున్న అన‌సూయ

పవన్ కల్యాణ్ ఒక స్టేట్ రౌడీ: వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్

కాలి న‌డ‌క‌న తిరుమ‌ల కొండెక్కిన ఉప్పెన‌ హీరో, హీరోయిన్లు

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -