- Advertisement -

టాలీవుడ్‌కు మ‌రో షాక్‌

- Advertisement -

టాలీవుడ్ ప్ర‌ముఖ గేయ‌ ర‌చ‌యిత కులశేఖర్ ఓ దొంగ‌త‌నం కేసులో అరెస్ట్ కావ‌డం సంచ‌ల‌నంగా మారింది.పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే…తెలుగు ఇండ‌స్ట్రీలో గేయ ర‌చ‌యిత‌గా త‌న‌కంటూ ప్ర‌త్యేక స్థానం ఏర్ప‌ర‌చుకున్నాడు కులశేఖర్ .తెలుగులో చాలానే పాట‌లు రాశాడు కులశేఖర్.అలాంటి కులశేఖర్ వ్యసనాలకు బానిసై దొంగ‌తనాల‌కు అలావాటు ప‌డ్డాడు. దీంతో కుటుంబసభ్యులు సైతం ఆయన్ను పట్టించుకోకపోవడంతో.. అయినవారికి కూడా దూరమయ్యాడు.

ఓ సినిమాలో కులశేఖర్ రాసిన పాట పాట బ్రాహ్మణులను కించపరిచేలా ఉందని ఆ సామాజికవర్గం అతన్ని దూరంగా పెట్టింది. 2016లో కాకినాడలోని ఆంజనేయస్వామి దేవాలయంలో శఠగోపం చోరీ చేశాడు.ఆ కేసుకు సంబంధించి రాజమండ్రి జైలులో ఆరు నెలల పాటు జైలు శిక్షను అనుభవించాడు. నిన్న(ఆదివారం) హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని ఓ ఆలయం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో పోలీసులు కులశేఖర్‌ను అరెస్ట్ చేశారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -