ఫిదా మూవీ.. ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో హీరోగా వరుణ్ తేజ్, హీరోయిన్ గా సాయి పల్లవి నటించింది. ఇక వరుణ్ మాసయినా, క్లాసయినా.. ఏ పాత్ర అయిన చేయగలను అని నిరుపించుకున్నాడు. ఇక సాయి పల్లవి హీరోయిన్ గా ఈ సినిమాలో చేయడం ఈ సినిమాకి బాగా ప్లస్ అయింది. ఆమె చెప్పే డైలాగ్స్ కి థియేటర్లో గోల గోల.
ఆమె తెలంగాణ యాసలో మాట్లాడటం వల్ల కూడా సినిమా కి బాగా ఉపయోగపడింది. ఇక వరుణ్ మంచి అబ్బాయిగా.. ఎమోషన్ సీన్స్ లో అధ్భుతంగా చేశాడు. అందమైన ప్రేమ కథను శేఖర్ కమ్ముల అద్భుతంగా చూపించారు. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత.. మొదటి షోకే మంచి టాక్ సంపాదించుకుంది. అయితే ఎక్కువ ఈ సినిమాలో వరుణ్ కంటే.. సాయి పల్లవికే బాగా పేరు వచ్చిందన్న టాక్ వినిపిస్తోంది. అయితే వరుణ్ మాత్రం తనను తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర చేసిన దర్శకుడు శేఖర్ కమ్ములను జీవితంలో మరిచిపోలేనన్నారు.
సినిమాలో సాయిపల్లవి క్యారెక్టర్ బాగుంటుంది కాబట్టే ఆమెకు ఎక్కువ మార్కులు వచ్చాయనీ, అంతేతప్ప ఇందులో ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ అన్న భావన ఎవరిలోను లేదన్నారు వరుణ్ తేజ్. తనకు కథ చెప్పినప్పుడే.. సాయి పల్లవి పాత్ర అద్భుతంగా ఉంటుందని అర్ధం అయిందని అన్నారు. అందరూ కలిసికట్టుగా పనిచేయడం వల్లనే సినిమా సక్సెస్ దిశగా దూసుకెళ్ళిందని ఇటివలే వరుణ్ మీడియాకు తెలిపాడు.
