నారప్ప సెన్సార్​ పూర్తి.. విడుదల ఎప్పుడో?

మన తెలుగు హీరోలు ఇటీవల విభిన్న కథాంశాలను ఎంచుకుంటున్న విషయం తెలిసిందే. పాత కథాంశాలను, పాత ఫార్ములాలను పక్కకు పెట్టి.. ప్రయోగాత్మక చిత్రాల్లో నటించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అందులో భాగంగానే వెంకటేశ్​ నారప్ప అనే చిత్రంలో నటించేందుకు ఒప్పుకున్న విషయం తెలిసిందే. తమిళంలో సక్సెస్​ అయిన ‘అసురన్’ చిత్రానికి ఇది రీమేక్. తమిళంలో ధనుష్​ ఈ పాత్రను పోషించాడు. ఓ దళితుడు చేసే పోరాటం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో ధనుష్ నటనకు అవార్డులు కూడా వచ్చాయి.

అసురన్ తెలుగు వర్షన్ నారప్ప లో ప్రియమణి సైతం సుందరమ్మ అనే ఓ పాత్ర పోషిస్తున్నది. ప్రస్తుతం ఈ మూవీ సెన్సార్​ పూర్తిచేసుకున్నది. యూ/ఏ సర్టిఫికెట్​ వచ్చింది. నారప్ప సినిమాకు శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నాడు. సురేష్‌ బాబు, కలైపులి ఎస్‌. థాను సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ మూవీ ఓటీటీలో విడుదలవుతుందని కూడా ప్రచారం సాగుతోంది.

ఇదిలా ఉంటే శ్రీకాంత్​ అడ్డాల తొలిసారిగా ఓ విభిన్న కథాంశాన్ని తెరకెక్కిస్తున్నాడు. వెంకటేష్ కు రీమేక్ సినిమాలంటే మక్కువ. గతంలో పలు సినిమాలు రీమేక్ చేసి విజయాలు అందుకొన్నాడు. ఇప్పుడు కూడా నారప్ప తో పాటు దృశ్యం -2 కూడా వెంకీ రీమేక్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు వెంకటేశ్​కు ఎటువంటి ఫలితాన్ని ఇస్తాయో వేచి చూడాలి. దృశ్యం -2 ఓటీటీలో విడుదలయ్యే అవకాశం ఉంది.

Also Read

ఆర్​ఆర్​ఆర్​ విడుదల తేదీ వచ్చేసింది.. ఫ్యాన్స్​ కిక పండగే..!

అయ్యో రకుల్ ఏంటీ పరిస్థితి..!

Related Articles

Most Populer

Recent Posts