Wednesday, April 24, 2024
- Advertisement -

ఆన్ లైన్ ద్వారా ఆనందయ్య మందు పంపిణీ!

- Advertisement -

నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య మందు తయారీకి ఆయన మామిడీతోటలో సర్వం సిద్ధం చేస్తున్నారు. ఆనంద‌య్య క‌రోనా మందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన విష‌యం తెలిసిందే. జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ క‌మిటీ ఇచ్చిన‌ నివేదిక ప్ర‌కారం ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుని, కంట్లో వేస్తున్న మందుకు త‌ప్ప ఆనంద‌య్య ఇస్తున్న మిగతా మందులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వ‌డంతో ఆ మందు కోసం జ‌నాలు ఎదురుచూస్తున్నారు. ఆనందయ్య కరోనా మందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో పంపిణీ విధానంపై నెల్లూరు కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో అధికారులు సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్‌ చక్రధర బాబు, ఎస్పీ భాస్కర్‌ భూషణ్‌, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్దన్‌రెడ్డిలతో పాటు ఆనందయ్య హాజరయ్యారు. ఆనందయ్య మందులను వీలైనంత త్వరలో ఆన్ లైన్ ద్వారా పంపిణీ ప్రారంభిస్తామని నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు వెల్లడించారు. మరోవైపు ఆనందయ్య మందు పంపిణీ విషయం గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు తెగ హల్ చల్ చేశాయి.

అయితే ప్రైవేట్ వైద్యం చేయించుకోవడం కష్టంగా.. భారంగా మారిన ఈ సమయంలో ఆనందయ్య మందు పంపిణీ పై ప్రజలు దృష్టి పెడుతున్నారు. కరోనా లాక్ డౌన్ పరిస్థితుల నేపధ్యంలో ఇబ్బందులు నివారించేందుకు ఆన్ లైన్ ద్వారా పంపిణీ చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. ముడిసరకు సమీకరించి, నాలుగైదు రోజుల్లో మందు పంపిణీ ప్రారంభిస్తామని వెల్లడించారు.నేరుగా ఇతర ప్రాంతాల వారు ఎవ్వరూ మందు కోసం రావొద్దని అధికారులు సూచించారు. అవసరమైన ప్రాంతాలకు తామే మందు పంపిణీ చేస్తామని వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ కు మేఘా ఆక్సిజన్ క్రయోజనిక్ ట్యాంకులు

పవన్ కళ్యాన్ గురించి రాజమౌళి తండ్రి ఏమన్నారో తెలుసా?

హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు కాల్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -