Wednesday, May 8, 2024
- Advertisement -

ఆనాడు కష్టపడి తండ్రిని కాపాడుకుంది.. కానీ ఇప్పుడు!

- Advertisement -

గతేడాది లాక్‌డౌన్‌ వేళ గాయపడ్డ తండ్రిని వెనుక కూర్చోబెట్టుకుని 1200 కిలోమీటర్లు సైకిల్ తొక్కి సొంతూరికి తీసుకొచ్చిన జ్యోతి కుమారి ప్రతి ఒక్కరికీ సుపరిచతమే. సమాజంలో ఆడపిల్ల అన్ని రంగాల్లో ముందుకు దూసుకువెళ్తున్నా ఇంకా ఆడపిల్లలపై వివక్ష కొనసాగుతూనే ఉంది. మగవాళ్ళ కంటే శారీరకంగా బలహీనులు అన్న భావన ఉంది . అలాంటిది ఆడపిల్లలు ఎందులోనూ తక్కువ కాదని.. ఎంత కష్టమైనా భరించగలం అని నిరూపించింది జ్యోతి కుమారి. కరోనా లాక్ డౌన్ ఉపాధి లేకుండా చేస్తే సొంత ఊరికి పయనమైన ఓ తండ్రీ కూతుళ్ళు పడరాని పాట్లు పడ్డారు.

గత ఏడాది మే 10వ తేదీన ఢిల్లీ నుంచి దర్భాంగకు సైకిల్‌పై బయల్దేరారు. గాయపడిన తండ్రిని సైకిల్ పై ఎక్కించుకుని సుమారు వారం రోజుల పాటు 1200 కిలోమీటర్లు సైకిల్ తొక్కింది ఆ అమ్మాయి జ్యోతి కుమారి. ఆ అమ్మాయి ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ కూ ఎంపికైంది. తాజాగా జ్యోతి కుమారి ఇంట్లో విషాదం నెలకొంది. తండ్రి గురించి ఎంతగా కష్టపడి కాపాడుకుందో.. కానీ ఆ కష్టానికి ఏడాది కూడా నిండలేదు.. ఎంతో ఇష్టమైన తండ్రిని కోల్పోయింది.

గుండెపోటుతో ఆమె తండ్రి మరణించాడు. దీంతో ఆమె బాధ వర్ణనాతీతంగా మారింది. ఎన్నో బాధలు పడి, రెండు రోజులు తిండికి తిప్పలు పడి సొంతింటికి చేరి తండ్రిని దక్కించుకున్న ఆనందం ఎంతో కాలం లేకపోవడంతో కన్నీరు మున్నీరు అవుతుంది జ్యోతి.

భర్తను వదిలి వేరొకరికి దగ్గరైన ప్రియమణి..? ఎంటీకథా..?

పవన్ కళ్యాన్ గురించి రాజమౌళి తండ్రి ఏమన్నారో తెలుసా?

హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు కాల్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -