Friday, April 26, 2024
- Advertisement -

ఉత్తర్ ప్రదేశ్ : కాన్పూరులో ఘోర రోడ్డు ప్రమాదం..

- Advertisement -

ఉత్తరప్రదేశ్‌లో కాన్పూర్-అలహాబాద్ జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో 17 మంది చనిపోయారు. మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రయాణికులతో వెళ్తున్న మినీ బస్సు సచెంది వద్ద జేసీబీని ఢీకొని బ్రిడ్జి పైనుంచి కిందపడింది.సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. అయితే ఘటనా స్థలంలోనే పలువురు మరణించారు. యూపీ రోడ్ వేస్‌కు చెందిన శతాబ్ది ఏసీ బస్సు లక్నో నుంచి ఢిల్లీ వెళ్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. బస్సు బలంగా ఢీకొట్టడంతో జేసీబీ రోడ్డుకు అవతలివైపు పడింది, అదుపు తప్పిన బస్సు దొర్లుతూ ఒక గోతిలో పడిందని ఆయన తెలిపారు. ఈ ఘోర ప్రమాదంలో రెండు వాహనాల్లో ఉన్న దాదాపు అందరూ గాయపడ్డారని. వారిలో చాలామంది ఘటనాస్థలంలోనే చనిపోయారని ఎస్పీ చెప్పారు.

కాగా, ఈ ప్రమాదం విషయం తెలిసి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతికి గురయ్యారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఘటనపై విచారణకు ఆదేశించారు.

ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు. హోం మంత్రి అమిత్ షా కూడా గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. మృతుల కుటుంబాలకు తన సంతాపం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి బాధిత కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -