Monday, May 6, 2024
- Advertisement -

కృష్ణాన‌దిలో ఈత‌కు వెల్లిన న‌లుగురు విద్యార్థులు గ‌ల్లంతు…

- Advertisement -

జిల్లాలోని తాడేపల్లి మండలం గుండిమెండ గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కృష్ణా నదిని చూసేందుకు వెళ్లిన విద్యార్థులు సరదాగా ఈత కొట్టేందుకు కృష్ణాన‌దిలో దిగి గ‌ల్లంత‌య్యారు. చిర్రావూరుకు చెందిన ఏడుగురు విద్యార్థులు స్కూల్‌కు సెలవు కావడంతో కృష్ణానదిని చూడటానికి వెళ్లారు.

ఈత కొడదామని నదిలోకి దిగగా.. మరో ముగ్గురు ఒడ్డునే ఉండిపోయారు. అయితే నదిలో నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో.. నలుగురు ప్రవాహానికి కొట్టుకుపోయారు. ఒడ్డున ఉన్న ముగ్గురు పిల్లలు భయంతో కేకలు వేయగా.. స్థానికులు పరుగు పరుగున అక్కడికి వచ్చారు. కాని అప్పటికే నలుగురు కొట్టుకుపోయారు. తాడేపల్లి మండల కేంద్రం నుంచి తొమ్మిది కి.మీ. దూరంలో ప్రకాశం బ్యారేజీకి దిగువన ఈ విషాదం చోటుచేసుకుంది.

వారంతా ఒకే పాఠశాలకు చెందిన విద్యార్థులు. ఇద్దరు ఒకే కుటుంబానికి చెందినవారు. వారు శివ, క్రాంతి కుమార్, నీలం శశి, దినేష్‌లుగా గుర్తించారు. ఘటనాస్థలికి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, అధికారులు, పోలీసులు చేరుకున్నారు. మృతదేహాల కోసం గాలిస్తున్నారు. నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో గాలింపు చర్యలకు ఆటంకం కలుగుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -