Thursday, April 25, 2024
- Advertisement -

గుంటూరు జిల్లాలో కాకుల మృతితో భయంతో వణుకుతున్న ప్రజలు!

- Advertisement -

మధ్యప్రదేశ్ లో మొదలైన బర్డ్ ఫ్లూ పలు రాష్ట్రాల్లో కలకలం సృష్టిస్తుంది. ముఖ్యంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో వందల సంఖ్యలో కాకులు ప్రాణాలు కోల్పోతుండడాన్ని కేంద్ర తీవ్రంగా పరిగణిస్తోంది. ఇదిలా ఉంటే.. గుంటూరు జిల్లా కొల్లిపర శివారులో బుధవారం ఆరు కాకులు మృతి చెందాయి. అక్కడ కొద్ది రోజులుగా వరుసగా మృత్యువాత పడుతున్నాయి.  కాకులు మృతి చెందడంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు.

ఒక్కసారే అన్ని కాకులు మరణించడంతో స్థానికులు ఆ విషయాన్ని వెటర్నరీ అధికారులకు తెలియజేశారు. దీనిపై స్థానిక వెటర్నరీ అధికారిణి శ్రీలక్ష్మి మాట్లాడుతూ.. గత మూడ్రోజులుగా ఇక్కడ కాకులు మృత్యువాత పడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు.  ఎక్కడా అనుమానించదగ్గ లక్షణాలు కనిపించలేదని స్పష్టం చేశారు.

కాకులు మృతి చెందిన ఘటనపై పరిశీలించామని, విచారణ పూర్తయ్యాక వాస్తవాలను ప్రజలకు వెల్లడి చేస్తామని శ్రీలక్ష్మి తెలిపారు. ఐతే దేశంలో బర్డ్ ఫ్లూ విజృంభిస్తున్న సమయంలో కాకులు మరణించడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావారణమార్పుల శాఖ అడ్వైజరీ జారీచేసింది.

కొత్త గా వణికిస్తున్న బర్డ్​ ఫ్లూ కేసులు.. జర జాగ్రత్త..!

మహేశ్ బాబు సినిమాలో పవన్ కల్యాణ్ మాజీ భార్య!

నాలుగు పెద్ద సినిమాల నుంచి తప్పించారు.. అనసూయ షాకింగ్‌ కామెంట్స్‌

ఈ నాగార్జున కూతురు ఇప్పుడు ఎలా ఉందో అవక్కవుతారు…

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -