Saturday, April 27, 2024
- Advertisement -

అంబానీ ఇంటి వద్ద ఉన్న కారు కేసులో కొత్త ట్విస్ట్.. ఆయన కాదు అంట ఇప్పుడు..!

- Advertisement -

అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలు లభించిన కారు యజమాని హిరేన్​ మన్​సుఖ్ మృతి కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ) దర్యాప్తు కీలక విషయాలు వెల్లడించింది. ఆ కారు యజమాని హిరేన్ కాదని వివరించింది. దాని అసలు యజమాని ఠానేకు చెందిన శ్యామ్​ న్యూటన్​ అని పేర్కొంది. ఈ మేరకు హిరేన్​ మరణించక ముందు పోలీసులకు సమర్పించిన వాంగ్మూలంలో వెల్లడించారని తెలిపింది.

2018 నుంచి ఆ స్కార్పియో వాహనాన్ని మన్​సుఖ్​ హిరేన్ వినియోగిస్తున్నాడని ఎన్​ఐఏ అధికారులు తెలిపారు. కారు డెకరేషన్​ వ్యాపారం చేసే హిరేన్​కు తన కారును బాగు చేయించాలని శ్యామ్​​ ఇవ్వగా.. అందుకు రూ.2.8 లక్షల బిల్లును హిరేన్​ చేశాడని చెప్పారు.

ఆ డబ్బులను యాక్సిస్​ బ్యాంకు, హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు చెక్కుల రూపంలో హిరేన్​కు శ్యామ్​​ అందించగా.. అనంతరం ఆ కారును హీరేన్​కు అతడు​ అప్పగించాడని చెప్పారు. అయితే.. ఆ చెక్కులు రెండూ బౌన్స్​ అయ్యాయని పేర్కొన్నారు.

పిల్లలు పుట్టకుండా సింహానికి ఆపరేషన్!

హైదరాబాద్ లో జలకన్య ఆకారంలో వింత శిశువు జననం!

చెర్రీ సరసన మరోసారి బాలీవుడ్ బ్యూటీ!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -