Saturday, April 27, 2024
- Advertisement -

చిన్నారి సింధు శ్రీ హత్య కేసులో వీడిన మిస్టరీ

- Advertisement -

విశాఖలో సంచలనం సృష్టించిన చిన్నారి సింధు శ్రీ అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. చిన్నారి తల్లి వరలక్ష్మి ప్రియుడే హంతకుడుగా తేల్చారు. చిన్నారిని కర్రతో కొట్టి చంపి అనారోగ్యంతో చనిపోయినట్లు నిందితులు చిత్రీకరించే యత్నం చేసినట్లు తెలిసింది. జగదీష్‌పై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. చిన్నారి సింధు శ్రీ తల్లి జగదీష్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. సింధు శ్రీని తానే పాత మార్చానని పోలీసుల విచారణలో జగదీష్ అంగీకరించాడు. చిన్నారి హత్యకేసులో తల్లి వరలక్ష్మి పాత్ర పైన కూడా పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు.

జివిఎంసి పరిధి మారికవలస ప్రాంతంలో చిన్నారి సింధు శ్రీ (2) అనుమానాస్పదంగా మృతిచెందిన సంఘటన గురువారం (జూన్ 3) వెలుగులోకి వచ్చింది. సిఐ ఎ.రవికుమార్‌ కథనం ప్రకారం.. మారికవలస గ్రామానికి చెందిన పీతల వరలక్ష్మి, పెద్దన రమేష్‌ కుమార్‌ భార్యాభర్తలు. వీరికి 2014లో వివాహమైంది. సింధు శ్రీ (2) వీరి కుమార్తె. గత కొంత కాలంగా భార్యాభర్తల మద్య గొడవలు జరగడంతో జగదీష్ అనే వ్యక్తితో సింధు శ్రీ తల్లి వరలక్ష్మి వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది.

భర్తతో విడిపోయిన వరలక్ష్మి మారికవలస రాజీవ్‌ గహకల్ప కాలనీలో గత నెల 14 నుంచి ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. తమ అక్రమ సంబంధానికి చిన్నారి అడ్డు వస్తుందని.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చిన్నారిని తీవ్రంగా కొట్టి గాయపరిచిన జగదీష్ ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు పలు ఆస్పత్రులకు తీసుకెళ్లాడు. చిన్నారికి ఒంట్లో బాగాలేకపోవడంతో ఆస్పత్రులకు తీసుకెళ్తున్నట్లు నమ్మించినట్లు జగదీష్ తెలిపారు.

సింధు మరణంపై అనుమానం వ్యక్తం చేసిన తండ్రి రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేయడంలో అసలు విషయం బయటపడింది. కేసు నమోదు చేసుకొని పోలీసులు విచారణ చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పాప మృతదేహాన్ని శ్మశాన వాటికలో పూడ్చిపెట్టిన ప్రాంతం నుంచి తీసి పోస్టుమార్టం నిమిత్తం కెజిహెచ్‌కు తరలించారు. వివాహేతర సంబంధమే చిన్నారి ప్రాణం తీసిందని పోలీసులు తేల్చారు.

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన నటి రిచా గంగోపాధ్యాయ

కార్తీకదీపం దర్శకుడితో వంటలక్క.. డైరెక్టర్ పై విరుచుకుపడ్డ నెటిజన్లు?

ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -