Thursday, March 28, 2024
- Advertisement -

అతి వేగం ప్రాణం తీసింది..

- Advertisement -

దేశంలో ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. దీనికి కారణం అతి వేగం.. మద్యం సేవించి వాహనాలు నడపడం.. డ్రైవర్ల నిద్ర లేమి వల్ల జరిగే ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రమాదాలు ఎలాంటివి అయినా ఓ నిండు కుటుంబం రోడ్డున పడుతున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ వేళ అతి వేగంగా బైక్ నడపడం ఓ యువకుడి ప్రాణాలు తీసింది. మంచిర్యాల జిల్లాలో జరిగిన ఓ ప్రమాదం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. జిల్లాలోని జన్నారం మండలం తపాలపూర్ వద్ద జరిగిందీ ఘటన. అతివేగంతో ఓ యువకుడు తన మిత్రుడి ప్రాణాలను పణంగా పెట్టాడు.

జిల్లాలోని జన్నారం మండలం తపాలపూర్ వద్ద చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. అటు వైపుగా ఇద్దరు యువకులు బైక్‌పై దూసుకొస్తున్నారు. లాక్‌డౌన్ అమల్లో ఉండడం, చెక్‌పోస్టు వద్ద పోలీసులు ఉండడంతో బైక్‌ను డ్రైవ్ చేస్తున్న యువకుడు భయపడ్డాడు. దూరం నుంచి బైక్ వేగంగా రావడాన్ని అక్కడే ఉన్న కాపలా పోలీసులు గమనించారు. బైక్ ఆపాలని చేతులతో పలుసార్లు సైగలు చేశారు. అయినా వారు వినలేదు. బైక్‌తో వేగంగా దూసుకొచ్చేశాడు. దగ్గరికి వచ్చాక గేటును చూసి బైక్ నడుపుతున్న వ్యక్తి కిందికి వంగగా వెనక ఉన్న వ్యక్తి గేటుకు తగిలి ఎగిరిపడ్డాడు.

అతను అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ప్రమాదానికి సంబంధించిన వీడియో మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. సీసీటీవీ పుటేజీ ఆధారంగా పోలీసులు విచారణ జరుపుతున్నారు. మరోవైపు అటవీ శాఖ‌ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించి‌ యువకుని మరణానికి‌ కారణమైయ్యారని బంధువులు అరోపిస్తున్నారు. ఆ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని బందువులు కోరుతున్నారు.

మంచి మనసు చాటుకున్న అలీ దంపతులు

అలాంటి అబ్బాయిలు అస్సలు నచ్చరు : కృతిశెట్టి

నేటి పంచాంగం,సోమవారం(24-05-2021)

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -