Tuesday, April 30, 2024
- Advertisement -

ఫైబర్ నెట్ కేసు..బాబుకు బిగ్ షాక్

- Advertisement -

అవినీతి కేసుల్లో టీడీపీ అధినేత చంద్రబాబుకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే చంద్రబాబు ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో 40 రోజులుగా రిమాండ్‌లో ఉండగా తాజాగా ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను నవంబర్ 8కి వాయిదా వేసింది.అయితే తర్వాత చంద్రబాబు లాయర్ల విజ్ఞప్తితో విచారణను నవంబర్ 9కి వాయిదా వేసింది.

ఏపీ హైకోర్టు ఫైబర్ నెట్ కేసులో మందుస్తు బెయిల్ పిటిషన్‌ని తిరస్కరించిన నేపథ్యంలో బాబు సుప్రీంను ఆశ్రయించారు. ప్రధానంగా సెక్షన్ 17ఏ పైనే వాదనలు జరిగినట్లు తెలుస్తోంది. అయితే తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయవద్దని సూచించింది న్యాయస్థానం. ఇదొక్కటే బాబుకు కాస్త రిలీఫ్.

అయితే ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ వస్తుందని టీడీపీ నేతలు భావించారు. కానీ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా పడటంతో తెలుగుదేశం నేతలు నిరాశలో మునిగిపోయారు. ఏపీ సీఐడీ తరపున ముకుల్ రోహిత్గీ వాదనలు వినిపించారు. జస్టిస్ అనిరుద్ధ బోస్,జస్టిస్ బేలా,ఎమ త్రివేదీలతో కూడిన ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు ఇరు పక్షాల న్యాయవాదులు. ఇక స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ వెకేషన్ బెంచ్‌కు హైకోర్టు బదిలీ చేయగా విచారణను దసరా సెలవుల తర్వాతే చేపడతామని న్యాయస్థానం పేర్కొంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -