Friday, May 3, 2024
- Advertisement -

బాలయ్య ఈసారి హిందూపురం నుండి డౌటే!

- Advertisement -

టీడీపీ – జనసేన పొత్తు తర్వాత ఈ రెండు పార్టీలు ఉమ్మడి కార్యచారణతో ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రధానంగా ఉమ్మడి మేనిఫెస్టోని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలా వ్యూహ రచన సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై ఉండగా ఈ నెల 28న తిరిగి రిమాండ్‌ కావాల్సిన పరిస్థితి. ఈలోపే అన్ని పరిస్థితులను చక్కదిద్దే పనిలో ఉన్నారు చంద్రబాబు.

ఇక తాను జైలుకెళ్లిన తర్వాత ప్రచార బాధ్యతలను లోకేష్, బాలకృష్ణకు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా రాయలసీమ బాధ్యతలను బాలయ్య బాబుకు అప్పజెబుతారని పార్టీలో టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో బాలకృష్ణ పోటీ చేసే అవకాశం లేదని సమాచారం. ఆయన్ని రాజ్యసభకు పంపి పార్టీ పూర్తిగా ప్రచార బాధ్యతలను చూసుకునేలా ప్లాన్ చేశారని విశ్వసనీయ సమాచారం.

అయితే వాస్తవానికి హిందూపురం నందమూరి కుటుంబానికి కంచుకోట. ఎన్టీఆర్ రెండు సార్లు, హరికృష్ణ ఒకసారి, బాలయ్య బాబు రెండు సార్లు ఇక్కడి నుండి గెలుపొందారు. టీడీపీ వ్యతిరేక గాలిలోనూ ఇక్కడి ప్రజలు నందమూరి కుటుంబానికే పట్టం కట్టారు. ఈ నేపథ్యంలోనే బాలయ్య హిందూపురం నుంచే పోటీకే సై అంటున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ బాలయ్య తప్పనిసరి పరిస్థితుల్లో రాజ్యసభకు వెళ్తే లోకేష్ హిందూపురం నుండి బరిలోకి దిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా కొద్ది రోజుల్లో హిందూపురం ఎవరిది అనేదానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -