Tuesday, May 7, 2024
- Advertisement -

టీడీపీ ముందున్న ఆప్షన్ ఇదొక్కటే!

- Advertisement -

రెండు రోజులైతే టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్, రిమాండ్‌కు సరిగ్గా నెల రోజులు. బెయిల్ కోసం విశ్వప్రయత్నాలు చేశారు చంద్రబాబు తరపు న్యాయవాదులు. కానీ ఏ మాత్రం ఫలితం లేకపోయింది. ఇక ఇప్పటికే బాబు రిమాండ్‌ను మూడోసారి అక్టోబర్ 19 వరకు పొడగించగా సోమవారం చంద్రబాబు బెయిల్ ,కస్టడీ పిటిషన్లపై తీర్పు ఇవ్వనుంది ఏసీబీ కోర్టు. ఈ నేపథ్యంలో సోమవారం ఏం జరుగుతుందోనని అంతా ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నారు.

ఇక చంద్రబాబు బెయిల్ రాకపోతే ఏం చేయాలనే దానిపై ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు టీడీపీ నాయకులు. బాబుకు బెయిల్ లభించకపోతే భువనేశ్వరి, బ్రాహ్మణిలకు రంగంలోకి దించే ప్లాన్ చేస్తున్నారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి బస్సు యాత్ర చేసేలా సన్నాహాలు చేస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ అయిన నంద్యాల లేదా కుప్పం నుండి బస్సుయాత్ర ప్రారంభించే అవకాశాలున్నాయి.

ఇక రాయలసీమ కోడలు అంటూ కొత్త నినాదంతో రానుంది బ్రాహ్మణీ. లోకేష్ యువగళం పాదయాత్రను బ్రాహ్మణి చేపట్టనుంది. చంద్రబాబుతో ములాఖత్ తర్వాత లోకేష్ చెప్పిన సమాధానం బట్టి చూస్తే ఇదే అర్ధమవుతోంది. మొత్తంగా బ్రాహ్మణి, భువనేశ్వరి ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఖాయమైన సోమవారం వరకు పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -