Sunday, April 28, 2024
- Advertisement -

బీసీలంటే చంద్రబాబుకు పడదు?

- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబుకు బీసీలంటే అసలే ఇష్టం ఉండదు. అందుకే తాను అధికారంలో ఉన్న ఏ రోజు కూడా బీసీల గురించి ఆలోచించిన పాపాన పోలేదు. పోనీ తానే అధికారంలో లేకపోయినా ఏ ప్రభుత్వమైనా బీసీలకు మంచి చేస్తే సహించరు. అందుకే ఇప్పుడు జగన్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వైసీపీ సర్కార్ తీసుకొస్తున్న Fishmartని అవహేళన చేస్తున్నారు. కానీ జగన్‌కు BCలంటే Backbone Caste. రాబోయే ఎన్నికలు పెత్తందారులు, పేదవాడి మధ్య పోరాటం అంటారు.

నిజానికి బీసీలంటే సంపద సృష్టించే వర్గాలు. యాదవులు , గౌడలు , శెట్టి బలిజలు , కుమ్మరి , కమ్మరి , వడ్రంగి , మేదర , వడ్డెర , కురుబ ,బోయ , మత్స్యకార నుండి అనేక వర్గాలు వారు ప్రకృతి మీద ఆధార పడి సంపద సృష్టిస్తారు.అయితే ఇప్పటివరకు టీడీపీ వీరిని కేవలం ఓటు వేసే యంత్రాలుగానే చూసింది.

అయితే జగన్ మాత్రం వారికి వెన్నుదన్నుగా నిలవాలని నిర్ణయించారు. ప్రధానంగా మత్య్సకారుల జీవితాల్లో వెలుగు నింపేందుకు ఫిష్ మార్ట్‌లను తీసుకురావాలని నిర్ణయించారు. తద్వారా వారికి గిట్టుబాటు ధర వస్తుందని, దళారుల దోపిడి నుండి బయటపడతారని భావించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 12,500 ఫిష్ మార్ట్‌లు ప్రారంభించాలని నిర్ణయించగా దానిని అవహేళన చేస్తోంది టీడీపీ.

మత్య్సకారుల్లో ఎక్కువ శాతం నిరక్షరాస్యులు లేదా 10 వ తరగతి అంట కంటే తక్కువ చదివిన వారే ఉంటారు. అందుకే వారికి ఉద్యోగ అవకాశాలు తక్కువ. అయితే వారి వృత్తిపరంగా అవకాశాలు కల్పిస్తే ఆర్ధికంగా ఎదిగే అవకాశం ఉంటుందని జగన్ ఫిష్ మార్ట్‌లను తీసుకొచ్చారు. 14 ఏళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు ఒక్క ఫిష్ మార్ట్ తేలేదు. ఎందుకంటే ఆయనకు చేపల చెరువులు మాత్రమే ఉండాలి. వారే రేటు నిర్ణయించాలి. వారి చేతుల్లోకి మాత్రమే సంపాదన వెళ్లాలి. ఇది బాబు దురాలోచన. కానీ జగన్‌ రాష్ట్రంలో ఉన్న 35 లక్షల మంది మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపాలనే ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. ఆ సామాజిక వర్గం నుండి ప్రజాప్రతినిధులగా అవకాశం కల్పించారు. సిదిరి అప్పలరాజు , మోపిదేవి వెంకట రమణ , జయమంగళం ,వాడ బలిజ వర్గానికి చెందిన పద్మ ,పొన్నాడ సతీష్ ఇలా అవకాశాలు కల్పిస్తూనే ఉన్నారు. అలాగే పల్లెకార వర్గానికి చెందిన వారికి పార్లమెంట్ లో స్థానం లేదు. మొదటిసారిగా జగన్ ఆ అవకాశం కల్పించారు. వేట నిషేధ సమయంలో రెండు నెలల పాటు నెలకు రూ 10 వేల చొప్పున మత్య్సకారులకు ఆర్దిక సాయం అందించారు జగన్‌. మత్య్సకారుల జీవితాల్లో వెలుగులు వస్తుంటే కళ్ల మంటతో విషం చిమ్ముతున్నారు. అందుకే ఈసారి మత్స్యకారులంతా జై జగన్‌ అని నినదించే పరిస్థితి వచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -