ఉదయభానుతో అలాంటి రూమర్స్ పై స్పందించిన దర్శకుడు.. ఏం అన్నాడంటే?

- Advertisement -

సీనియర్ యాంకర్ ఉదయభాను తెలుగు ఇండస్ట్రీలో “ఎర్రసైన్యం” సినిమా ద్వారా తన కెరీర్ ను ప్రారంభించి తరువాత బస్తీమే సవాల్, కొండవీటి సింహం, ఖైదీ బ్రదర్స్, శ్రావణమాసం వంటి చిత్రాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే ఉదయభాను నటిగా కన్నా యాంకర్ గా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఉదయభాను వ్యాఖ్యాత గా చేసిన సాహసం చేయరా డింభకా, వన్స్ మోర్ ప్లీజ్, డాన్స్ బేబీ డాన్స్ వంటి షోలతో స్మాల్ స్క్రీన్‌ పై భారీ క్రేజ్ సొంతం చేసుకుంది.

తాజాగా ఆహానా పెళ్ళంట, పూల రంగాడు, భాయ్ సినిమాల దర్శకుడు వీరభద్రం ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉదయభానుతో ఒకప్పుడు వచ్చిన రూమర్స్ పై వివరణ ఇచ్చారు. నాగార్జునతో భాయ్ సినిమా చేస్తున్నప్పుడు అప్పట్లో వరుసగా రెండు హిట్ సినిమాలు తీసేసరికి కావాలని అలాంటి రూమర్స్ క్రియేట్ చేశారు.యాంకర్ ఉదయభానుపై తనపై పలు రకాల రూమర్స్ వచ్చాయని ,నిజానికి ఉదయభానును నేను ఎప్పుడు కలవలేదు. నేను ఆ సమయంలో దర్శకుడిగా బిజీగా ఉండడం వల్ల అప్పట్లో ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదని వీరభద్రం తెలిపారు.

- Advertisement -

Also read:హైపర్ ఆది అసలు వ్యక్తిత్వాన్ని బయటపెట్టిన.. దొరబాబు భార్య అమూల్య!

ఉదయభాను విషయానికొస్తే ఆమె ఇండస్ట్రీలో కనిపించకపోవడానికి కారణాలేంటని ఎంతోమంది ఆలోచించారు. అయితే 2004లో విజయ్ కుమార్ ను వివాహం చేసుకున్న ఉదయభాను 2016 సంవత్సరంలో ఓ పండంటి కవల ఆడ పిల్లలకు జన్మనిచ్చింది.ఈ విధంగా కవలపిల్లలు పుట్టడం ద్వారా వారి బాగోగులు చూసుకుంటూ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.ఇపుడిపుడే పలు టీవీ ప్రోగ్రామ్స్‌కు హోస్ట్‌గా వుండటంతో పాటు, పలు ఈవెంట్స్‌‌కు హోస్ట్ గా వవహరిస్తోంది.

Also read:టాలీవుడ్ హీరోయిన్లను దూరం పెడుతున్న ప్రభాస్.. కారణం అదేనా?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -