Wednesday, May 29, 2024
- Advertisement -

పాలేరు…షర్మిల వరెస్ట్ ఛాయిసా?

- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ముందంజలో ఉన్నాయి బీఆర్ఎస్, కాంగ్రెస్. ఓ వైపు సీఎం కేసీఆర్ సుడిగాలి పర్యటనలు చేస్తుండగా మరోవైపు కాంగ్రెస్ బస్సుయాత్ర నేటి నుండి ప్రారంభం కాగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. ఇక బీజేపీ అగ్రనేతలు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటుండగా షర్మిల మాత్రం ఈ రేసులో వెనుకంజలోనే ఉందనే చెప్పాలి.

కాంగ్రెస్‌తో షర్మిల పార్టీ విలీనం సాధ్యం కాకపోవడంతో 119 నియోజకవర్గాల్లో ఒంటరి పోరుకు సిద్ధమైంది. ఇక తాను రెండు నియోజకవర్గాల నుండి బరిలో దిగుతానని ప్రకటించారు. పాలేరుతో పాటు మిర్యాలగూడ నుండి షర్మిల ఎన్నికల బరిలో ఉండనున్నట్లు సమాచారం. ఇక బోనస్‌గా షర్మిల భర్త బ్రదర్ అనిల్, విజయమ్మ కూడా పోటీలో ఉంటారని ప్రకటించారు. కానీ దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

ఇక ఆ పార్టీ పోటీచేసే 119 స్ధానాల సంగతి పక్కనపెడితే షర్మిల పోటీచేసే పాలేరు స్ధానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు బలంగా ఉన్నాయి. పాలేరు నుండి కాంగ్రెస్ తరపున పొంగులేటి లేదా తుమ్మల బరిలో దిగే అవకాశం ఉండటంతో షర్మిల పరిస్థితి ఏంటా అన్నది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే పాలేరులో షర్మిలకు డిపాజిట్ దక్కుతుందా అన్న అనుమానం వ్యక్తమవుతోంది. ఆమె గెలుపు సంగతి పక్కనపెడితే డిపాజిట్ దక్కుతుందా లేదా అన్న దానిపై జోరుగా బెట్టింగ్ సాగుతోంది. మరికొంతమందైతే పాలేరు షర్మిల వరెస్ట్ ఛాయిస్ అని సూచిస్తున్నారు. మరి ఆమె ఎక్కడి నుండి బరిలోకి దిగుతారు…?అసలు పోటీ చేస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -