Saturday, April 27, 2024
- Advertisement -

ఏపీ క్రాస్‌ రోడ్స్‌లో ఆ ముగ్గురు?

- Advertisement -

వారంత టీడీపీ సీనియర్ నేతలు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చక్రం తిప్పిన నాయకులు. తామే పార్టీ..పార్టీనే తాము అన్నంతలా ఎప్పుడూ మీడియాలో కనబడ్డ నేతలు. కానీ ఇప్పుడు మాత్రం సీన్ రివర్స్. టికెట్ తెచ్చేందుకు నానా తంటాలు పడుతున్నారు.ఇంతకీ వారెవరూ అనుకుంటున్నారా..మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, దేవినేని ఉమా, కళా వెంకట్రావ్‌.

వీరిలో దేవినేని ఉమామహేశ్వరరావుకు ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్స్ లేనట్లే. మైలవరం సీటును వసంత కృష్ణప్రసాద్‌కు కేటాయించగా పెనమలూరు టికెట్ బోడె ప్రసాద్‌కు ఇవ్వడంతో దేవినేని ముందున్న దారులన్ని మూసుకుపోయాయి. దేవినేనిని బుజ్జగించడంలో సక్సెస్ అయిన చంద్రబాబు ఆయనకు ఏం హామీ ఇచ్చారోనన్న చర్చ మాత్రం పార్టీలో జరుగుతుంది.

ఇక మిగిలిన ఇద్దరు నేతల్లో గంటా శ్రీనివాసరావుకు చీపురుపల్లి సీటు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు చంద్రబాబు. అయితే చీపురుపల్లి నుండి పోటీ చేసేందుకు గంటా ఆసక్తిచూపించడం లేదు. భీమిలీ గంటాకు ఇచ్చే ఛాన్స్ లేకపోవడంతో ఎన్నికల్లో నిలబడాలంటే గంటా ముందున్న ఆప్షన్ చీపురుపల్లి మాత్రమే. మరి దీనికి గంటా ఓకే చెప్తారా లేదా అన్న సస్పెన్స్ నెలకొంది.

కళా వెంకట్రావ్ ఎచ్చెర్ల సీటు కోసం పట్టుబడుతున్నారు. పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. 1985లోనే హోంమంత్రిగా పని చేశారు. తూర్పు కాపు సామాజికవర్గానికి చెందిన వెంకట్రావ్‌కు మూడో జాబితాలోనూ చోటు దక్కలేదు. అయితే ఈసారి కళాకు ఛాన్స్ వస్తుందా లేదా అన్న టెన్షన్ కార్యకర్తల్లో నెలకొంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -