Wednesday, May 8, 2024
- Advertisement -

జగన్ పొలిటికల్ గేమ్‌…టీడీపీ మటాష్!

- Advertisement -

రాజకీయాల్లో ఒకరిపై ఒకరు పైచేయి సాధిస్తేనే అధికారం. ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీ వేసే ప్రతీ అడుగు ఆచితూచి వేయ్యాలి. ఈ విషయంలో ఏపీ సీఎం జగన్‌ సక్సెస్ సాధించారనే చెప్పాలి. ఎందుకంటే ఎన్నికల వేళ జగన్ తీసుకున్న నిర్ణయం సంచలనం. 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిని,ప్రతిపక్ష నేతను అరెస్ట్ చేయాలనే ఆలోచనే సాహసం అంటే…అంతకుమించి ఒక కేసు తర్వాత మరో కేసు ఇలా చంద్రబాబును ఉక్కిరిబిక్కిరి చేయడంలో పూర్తి పైచేయి సాధించారు జగన్‌.

ఇక అరెస్ట్‌ల పర్వం చంద్రబాబుతోనే ఆగేలా కనిపించడం లేదు. ఆయన తనయుడు లోకేష్‌తో పాటు కీలక నేతలు అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల వేళ రోజురోజు జరుగుతున్న పరిణామాలు టీడీపీని చీకటిలోకే నెట్టేస్తున్నాయి. ఓ వైపు ఏపీ సీఐడీ అధికారులు చంద్రబాబు టార్గెట్‌గా కేసుల మీద కేసులు పెడుతూ కస్టడీ పిటిషన్‌ కూడా దాఖలు చేస్తున్నారు. దీంతో చంద్రబాబు ఇప్పట్లో బయటికి వచ్చే అవకాశం కనిపించడం లేదు.

చంద్రబాబు అరెస్ట్‌తో ఆయనపై ప్రజల్లో సానుభూతి పెరుగుతుందని అంతా భావించినా అది జరగకుండా సక్సెస్ అయ్యారు జగన్‌. బాబుపై సానుభూతి కాకుండా ఆయన చేసిన అవినీతిని అందరికి అర్ధమయ్యేలా వివరించడంలో ఖచ్చితంగా విజయం సాధించారు. అందుకే టీడీపీ నేతలు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి విఫలం అవుతూనే ఉన్నాయి. ఐటీ ఉద్యోగులు, పార్లమెంట్, అసెంబ్లీలో ఇలా టీడీపీ నేతలు ఎన్ని పోరాటాలు చేసినా ప్రజల్లో మాత్రం బాబుపై సానుభూతి రావడం లేదు. ఇక కొన్ని మీడియా ఛానళ్ల ద్వారా పేయిడ్ ప్రచారం నిర్వహిస్తున్న టీడీపీకి ప్రయోజనం లేకుండా పోతోంది. మొత్తంగా ఎన్నికల వేళ జగన్ మాస్టర్ స్ట్రోక్‌తో టీడీపీ నేతల మైండ్ బ్లాంక్ అయిందనే చెప్పాలి. ఎన్నికల సమయానికి జగన్‌ మరిన్ని షాక్‌లతో టీడీపీ నేతలకు ఊపిరిసల్పకుండా చేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -