Wednesday, May 8, 2024
- Advertisement -

నెల్లూరు..ఓటరు ఎవరివైపు!

- Advertisement -

నెల్లూరు రాజకీయాలు ఎప్పుడు ప్రత్యేకమే. ముఖ్యంగా నెల్లూరు సిటీ. టీడీపీ నుండి మాజీ మంత్రి నారాయణ బరిలో దిగుతుండగా వైసీపీ నుండి మహ్మద్ ఖలీల్ పోటీ చేస్తున్నారు. 2014 నుండి ఇక్కడ వైసీపీదే విజయం. ఆనం ఫ్యామిలీ ఇక్కడి నుండి ఐదు సార్లు గెలవగా వారి ఆధిపత్యానికి చెక్ పెడతూ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ 2014,2019లో విజయం సాధించారు. ఇక 2019లో మంత్రిగా పనిచేశారు కూడా. ఈసారి నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా అనిల్ పోటీ చేస్తుండగా ఖలీల్‌ను బరిలో దింపారు సీఎం జగన్.

నెల్లూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి పోటీ చేస్తుండటంతో ఖలీల్ అహ్మద్‌కు కలిసి వచ్చే అవకాశం. మరోవైపు టీడీపీ నుండి పోటీ చేస్తున్న నారాయణ 2014 నుంచి 2019 వరకు మంత్రిగా పనిచేశారు.2019 ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి ఓడిపోగా మరోసారి ఆయనకే అకవాశం ఇచ్చారు చంద్రబాబు.

ప్రస్తుతం నెల్లూరు డిప్యూటీ మేయర్‌గా ఉన్న ఖలీల్.. వైసీపీ చేస్తున్న అభివృద్ధి పనులను వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఖలీల్ విజయానికి పార్టీ నేతలు సైతం అహర్నిషలు లేకుండా కృషి చేస్తున్నారు. ముఖ్యంగా మైనార్టీ అభ్యర్థికి తొలిసారి అవకాశం రావడంతో ఆ వర్గానికి చెందిన ఓట్లపై ఆశలు పెట్టుకున్నారు ఖలీల్. టీడీపీ అభ్యర్థి నారాయణ కుటుంబం మొత్తం ఎన్నికల ప్రచారంలో మునిగి తేలగా ఈసారి ఎలాగైన నెల్లూరు సిటీని కైవసం చేసుకోవాలని రెండు పార్టీలు ఉవ్విళ్లూరుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -