Tuesday, April 30, 2024
- Advertisement -

బాబుకు బెయిల్..సుప్రీంలో జరిగేది ఇదేనా?

- Advertisement -

రాజమండ్రి జైలు నుండి టీడీపీ అధినేత చంద్రబాబును బయటకు తెచ్చేందుకు ఆయన తరపు లాయర్లు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. బెయిల్ పిటిషన్లను పలుమార్లు ఏపీ హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీంను ఆశ్రయించారు బాబు తరపు లాయర్లు. క్వాష్ పిటిషన్‌తో పాటు బెయిల్ పిటిషన్లు దాఖలు చేయగా రేపు విచారణ చేయనుంది సర్వోన్నత న్యాయస్ధానం. దీంతో సుప్రీం తీర్పు ఎలా ఉండనుందోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది.

ఇక స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసు ఇంకా ప్రాధమిక దశలోనే ఉంది. ఈ నేపథ్యంలో బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని హైకోర్టు స్పష్టంగా చెప్పింది. సుప్రింకోర్టు నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారమే తాము చంద్రబాబుకు బెయిల్ ఇవ్వటంలేదని పేర్కొంది. 17ఏ సెక్షన్ ఏ చంద్రబాబుకు వర్తించదని స్పష్టంగా చెప్పింది హైకోర్టు. ఈ నేపథ్యంలో సుప్రీంను ఆశ్రయించిన టీడీపీ నేతలకు అక్కడా నిరాశే ఎదురయ్యే పరిస్థితి ఉంటుందని న్యాయనిపుణులు చెబుతున్నారు.

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో చంద్రబాబే ప్రధాన పాత్రదారు అని సీఐడీ ఛార్జిషీట్‌లో తెలిపింది. బాబును ఆయన్ని కస్టడీకి కోరింది సీఐడీ. అందుకే ఈ కేసులో హైకోర్టు బెయిల్ నిరాకరించిన తర్వాత సుప్రీం బెయిల్ ఇచ్చే అవకాశాలు తక్కువే. ఎందుకంటే కేసు విచారణ దశలో ఉన్నప్పుడు కింది స్ధాయి కోర్టులు ఇచ్చిన తీర్పునే సుప్రీం పరిశీలిస్తుంది..అది ముఖ్యంగా ఆర్ధిక నేరాలకు సంబంధించిన కేసులైతే స్వయంగా సర్వోన్నత న్యాయస్ధానామే బెయిల్ ఇవ్వకూడదని పేర్కొన్న నేపథ్యంలో చంద్రబాబుకు నిరాశే ఎదురయ్యే అవకాశం ఉందని న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు.

ఇక బాబే ఈ కేసులో ఏ1గా ఉండటం,చంద్రబాబు సూచనతోనే ఈ స్కాం జరిగిందని స్పష్టమైన ఆధారాలను సీఐడీ చూపించడంతో అటు హైకోర్టు,ఇటు ఏసీబీ కోర్టులో చంద్రబాబు లాయర్ల వాదనలు వీగిపోయాయి. ఇక చంద్రబాబు రెండు రోజుల కస్టడీ ముగిసిన తర్వాత బాబు తరపు లాయర్లపై అసహనం వ్యక్తం చేశారు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి. పదేపదే బెయిల్ పిటిషన్లు వేయడం ద్వారా కోర్టు సమయం వృధా అవుతుందని చెప్పిన పరిస్థితి నెలకొంది. దీనిని బట్టి చూస్తే సుప్రీంలోనూ బాబును నిరాశే ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -