- Advertisement -

జనసేనకు సీటిస్తే..ఇండిపెండెంట్‌గా పోటీ!

- Advertisement -

టీడీపీ – జనసేన పొత్తులో ప్రతిష్టంభన తారాస్థాయికి చేరుకుంది. ఓ వైపు పొత్తు ఖరారైందని వార్తలు వస్తుండగా మరోవైపు కొన్ని స్థానాల్లో మాత్రం టీడీపీకి జనసేన, జనసేనకు ఇస్తే టీడీపీ ఇండిపెండెంట్‌గా పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నారు.

ప్రధానంగా ఉమ్మడి విజయనగరం జిల్లాలో జనసేన కోరుతున్న సీట్లలో టీడీపీ గట్టి బలం ఉంది. విజయనగరం, నెల్లిమర్లతో మరో స్థానాన్ని జనసేన కొరుతోంది. అయితే వీటిలో ఒక సీటును పవన్ పార్టీకి ఇవ్వడానికి టీడీపీ సిద్ధంగా ఉండగా జనసేన మాత్రం మూడు స్థానాలను పట్టబడుతోంది.

ఇప్పటికే నెల్లిమర్లలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. మాజీ మంత్రి పతివాడ నారాయణస్వామి కి ప్రస్తుత ఇంచార్జి కర్రోతు బంగార్ రాజుల మధ్య సీటు కోసం పోటీ ఉంది. అలాగే లోకం మాధవి జనసేన తరపున తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీ ఇక్కడ బలంగా ఉండగా దీనిని వదులుకునేందుకు ఆ పార్టీ సిద్ధంగా లేదు. విజయనగరంలో అశోక్ గజపతిరాజు కానీ ఆయన కుమార్తె కానీ పోటీ చేస్తారు తెలుస్తోండగా ఈ సీటు కోసం గట్టిగా పట్టబడుతోంది జనసేన.అలాగే గజపతినగరం సీటును జనసేనకు ఇస్తారని ప్రచారం జరుగుతుండగా ఈ స్థానాలను జనసేనకు కేటాయిస్తే ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగుతామని హెచ్చరిస్తున్నారు తెలుగుదేశం నాయకులు. మరి చంద్రబాబు పొత్తు, సీట్ల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -