Sunday, April 28, 2024
- Advertisement -

ఆ మూడు సీట్లపైనే జగన్ ఫోకస్!

- Advertisement -

వైనాట్ 175 పేరుతో దూసుకుపోతున్నారు సీఎం జగన్. ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం ఉండగా ఇప్పటికే పెద్ద ఎత్తున అభ్యర్థుల మార్పు చేపట్టి కథనరంగంలో దిగారు. ఇక త్వరలోనే రీజియన్ల వారీగా వైసీపీ కేడర్‌తో జగన్ సమావేశాలు నిర్వహించనుండగా ఈసారి కొన్ని కీలక స్థానాలే టార్గెట్‌గా ముందుకు సాగుతున్నారు. ప్రధానంగా శ్రీకాకుళం ఎంపీ స్థానంతో పాటు గుంటూరు స్థానాలపై దృష్టి సారించగా వీటితో మరో మూడు అసెంబ్లీ స్థానాలే టార్గెట్‌గా ముందుకు సాగుతున్నారు.

ఇంతకీ ఆ స్థానాలు ఏంటనుకుంటున్నారా…కుప్పం, మంగళగిరి,హిందూపూర్. కుప్పం నుండి టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తుండగా హిందుపూర్‌ నుండి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తుండగా మంగళగిరి నుండి నారా లోకేష్ పోటీ చేయనున్నారు. ఈ మూడు స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఇప్పటికే గ్రౌండ్ లెవల్ ప్లాన్ ప్రీపేర్ చేశారు జగన్.

కుప్పంలో వైసీపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ భరత్‌ గత ఐదేళ్లుగా కష్టపడుతున్నారు. ఇక చంద్రబాబు కుప్పంలో 7 సార్లు గెలవగా 8వ సారి బరిలో నిలవనున్నారు. హిందూపురంలో వైసీపీ అభ్యర్థిగా కోడూరి దీపికను బరిలోకి దించింది వైసీపీ. ఇక బాలకృష్ణ ఇప్పటికే ఈ స్థానం నుండి రెండుసార్లు విజయం సాధించగా హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇక ఈ రెండు స్థానాల్లో పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి తనదైన మార్క్ చూపిస్తున్నారు.

ఇక మంగళగిరిలో 2019లో నారా లోకేష్‌ను ఓడించడంలో సక్సెస్ అయ్యారు జగన్‌. ఇక్కడి నుండి ఈసారి బరిలోకి దిగుతున్న లోకేష్‌కు మరోసారి షాకివ్వాలని భావిస్తున్నారు. మంగళగిరి బాధ్యతను విజయసాయిరెడ్డికి అప్పజెప్పారు. మొత్తంగా టీడీపీ ముగ్గురు కీలక నేతలను ఓడించేందుకు బిగ్ స్కెచ్ వచేశారు. మరి ఇది ఎంతవరకు పలిస్తుందో వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -