Monday, May 6, 2024
- Advertisement -

విశాఖ ఎంపీ..ఆ ఇద్దరు వైసీపీ నేతల మధ్యే పోటీ!

- Advertisement -

ఏపీలో ఎన్నికలకు ఇంకా 5 నెలల సమయం ఉండగానే ఇప్పటినుండే పోటీ చేసే ఆశావాహులు తమ ప్రణాళికను రెడీ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా విశాఖ ఎంపీ సీటు కోసం గట్టి పోటీ నెలకొంది. ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ ఎంవీవీ సత్యనారయణ ఈసారి అసెంబ్లీ బరిలోకి దిగాలని భావిస్తున్నారు. ఇప్పటికే విశౄఖ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గంపై దృష్టి సారించి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక సీఎం జగన్‌ సైతం ఎవీవీ అసెంబ్లీకి పోటీచేయాలనే ప్రతిపాదనకు ఒకే చెప్పినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంల ఎంవీవీ స్థానంలో ఎవరిని నిలబెట్టాలనే అనేక తర్జనభర్జనల అనంతరం బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి సీటు ఇవ్వాలనే క్లారిటీకి వచ్చారట. ఎందుకంటే ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో బీసీల ఓట్లు ఎక్కువ. ముఖ్యంగా యాదవ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండటంతో వైసీపీ యాదవులకే టికెట్ ఇవ్వాలని చూస్తోంది.

ఇందులో భాగంగా ఇద్దరి పేర్లను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీగా ఉన్న వంశీక్రిష్ణ శ్రీనివాస్‌తో పాటు మేయర్ గొలగాని హరి వెంకటకుమారి పేర్లను పరిశీలిస్తున్నారట. శ్రీనివాస్‌ విశాఖ తూర్పు నుంచి రెండు సార్లు పోటీ చేశారు. సౌమ్యుడు, వివాద రహితుడు. అయితే ఆయన ఎంపీగా కంటే ఎమ్మెల్యేగానే పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారట. విశాఖ నగర మేయర్ ఉన్న వెంకట కుమారి ఉన్నత చదువులు చదివారు. మహిళా ప్రతినిధిగా ఉండడం ఆమెకు ప్లస్ పాయింట్‌గా మారింది. ఆమె ఎంపీగా పోటీ చేసేందుకు రెడీగా ఉన్నారు. వీరితో పాటు మరికొంతమంది పేర్లను పరిశీలిస్తోంది వైసీపీ అధిష్టానం. మొత్తంగా ఈసారి విశాఖ ఎంపీ సీటు బీసీలకు కేటాయిస్తుండటంతో మరోసారి ఫ్యాన్స్‌ గాలి వీయడం ఖాయంగా కనిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -