విశాఖలో బర్డ్ ఫ్లూ? భయంతో వణికిపోతున్న ప్రజలు!

- Advertisement -

కరోనా మహమ్మారి ఓ వైపు సెకెండ్ వేవ్ అంటూ జనాలు భయంతో వణికిపోతున్నారు. ఇది చాలాదని ఇప్పుడు దేశ వ్యాప్తంగా బర్డ్ ఫ్లూ భయం మొదలైంది. మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, గుజరాత్‌, హర్యానా, రాజస్థాన్‌, కేరళ రాష్ట్రాల బర్డ్ ఫ్లూ భయం బెంబేలెత్తించింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా బర్డ్ ఫ్లూ భయం మొదలైంది. వలస పక్షుల్లోనే ఎక్కువగా ఈ ఫ్లూ కనిపిస్తోందని కేంద్రం వెల్లడించింది.

ఇపుడు ఏపీలో కూడా బర్డ్ ఫ్లూ విస్తరిస్తోందని ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. కాగా,  విశాఖనగరంలోని డివిజనల్ రైల్వే మేజేనర్ ఆఫీస్ సమీపంలోని వందల ఏళ్ల చరిత్ర కలిగిన‌  చెట్ల మీద కాపురం ఉండే కాకులకు బర్డ్ ఫ్లూ సోకింది అన్న వార్త నగరాన్ని హడలెత్తిస్తోంది. 

- Advertisement -

అసలే బర్డ్ ఫ్లూ అని భయపడుతుంటే.. రెండు కాకులు విచిత్రమైన పరిస్థితుల్లో చెట్ల మీద నుంచి గిరగిరా కొట్టుకుంటూ నేల మీద హఠాత్తుగా పడి కొన్ని కాకులు అలా మరణించడాన్ని చూసిన నగరవాసులు భయాందోళలనకు గురి అవుతున్నారు. సమాచారం అందుకున్న వెటర్నిటీ డిపార్ట్మెంట్ రంగంలోకి దిగి ఈ ఘటనను సీరియస్ గా అధ్యయం చేస్తోంది.

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News

- Advertisement -
Loading...