ఆర్​ఆర్​ఆర్​ షూటింగ్​ డేట్​ ఫిక్స్​.. మరి రిలీజ్​ ఎప్పుడో?

- Advertisement -

ఆర్​ఆర్​ఆర్​ మూవీ కోసం ఇటు మెగా ఫ్యాన్స్​.. అటు తారక్​ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. కరోనా లాక్​డౌన్​ ఎఫెక్ట్​తో ఈ సినిమా షూటింగ్​కు పలు అంతరాయాలు ఏర్పడిన విషయం తెలిసిందే. రాజమౌళి సినిమా అంటేనే ఎంతో ఆలస్యం అవుతూ ఉంటుంది. ఏళ్లకు ఏళ్లు సినీ జనాలకు ఎదురుచూపులు తప్పవు. రిలీజ్​ అయ్యాక ఫ్యాన్స్​ కు నిరాశ మాత్రం ఉండదు. ఇటు అభిమానులకు వినోదం.. అటు నిర్మాతలకు కాసుల వర్షం కురుస్తూ ఉంటుంది.

ఇక హీరోల ఇమేజ్​ సైతం ఆకాశాన్ని అందుకుంటుంది. అందుకే రాజమౌళి సినిమాలంటే అంత క్రేజ్​. ఇదిలా ఉంటే చారిత్రక వీరులు.. కుమ్రం భీం, అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్ర ఆధారంగా ఆర్​ఆర్​ఆర్​ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అల్లూరిగా చరణ్​.. కుమ్రంభీంగా తారక్​ నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్లు అభిమానులను మెప్పించాయి. షూటింగ్​ కూడా 70 శాతం పూర్తయ్యింది. కానీ.. కరోనా ఎఫెక్ట్​తో చిత్రీకరణ ఆగిపోయింది. అయితే ఈ సినిమా షూటింగ్​ ఎప్పటి నుంచి ప్రారంభమతుంది? ఎప్పటికీ పూర్తవుతుంది? మూవీ ఎప్పుడు రిలీజ్​ అవుతుంది? అని ఫ్యాన్స్​ ఎదురుచూస్తున్నారు.

- Advertisement -

తాజా సమాచారం ప్రకారం.. జూలై 1 నుంచి “ఆర్ఆర్ఆర్” షూటింగ్ ను తిరిగి ప్రారంభించబోతున్నట్టు సమాచారం. అక్టోబర్​ 13న ఈ సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్​ సన్నాహాలు చేస్తున్నారు. కానీ ఇప్పట్లో అది సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. విడుదల తేదీపై క్లారిటీ లేదు. బహుశా వచ్చే సమ్మర్ సీజన్ లోనే ఈ సినిమా విడుదల ఉండొచ్చని టాక్. కానీ షూటింగ్ మాత్రం త్వరలో ప్రారంభం కాబోతున్నట్టు సమాచారం.

Also Read

తారక్​ మూవీలో విజయ్​ సేతుపతి..! ఏ క్యారెక్టర్​ అంటే?

బన్నీ అస్సలు తగ్గేటట్టు లేడుగా..!

సీతగా ఆమెనా.. అస్సలు ఒప్పుకోం..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -