సరిలేరు నీకెవ్వరు కాపీ కొట్టారా ?

- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా నటిస్తున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. ఇటీవలే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ తో మహేష్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ టీజర్ ట్రెండింగ్ లోకి వెళ్లింది. అభిమానులే కాదు.. సినీ ప్రముఖులు కూడా ఈ టీజర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో టీజర్ పై విమర్శలు వస్తున్నాయి.

ప్రధానంగా మహేష్ బాబు యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఈ టీజర్ ను ఆడుకుంటున్నారు. టీజర్ లో మహేష్ బాబు ఆర్మీ ఆఫీసర్ గా కనిపించిన తీరు.. ఆ తర్వాత సొసైటీలో జరిగే అరాచకాలను ఎదుర్కొనే అంశం చూస్తే ఇది అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా నుంచి ఎత్తేసినట్లు పేర్కొంటున్నారు. నా పేరు సూర్య చిత్రంలో కూడా అల్లు అర్జున్ ఆర్మీ పాత్రలో కనిపించాడు. ఆ తర్వాత సొసైటీలో జరిగే అరాచకాలను అడ్డుకునే తీరును చూపించారు.

- Advertisement -

దాంతో మహేష్ టీజర్ ను అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. ఆర్మీ ఆఫీసర్ అంటే అల్లు అర్జున్ లా ఉండాలని.. ఆ సినిమా కోసం అల్లు అర్జున్ తనని తాను మార్చుకున్నాడని.. కానీ సరిలేరు నీకెవ్వరు లో మాత్రం మహేష్ ఎప్పటిలానే కనిపించాడని.. కొత్తగా ఏం లేడని విమర్శలు చేస్తున్నారు. అందుకు మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా కౌంటర్లు ఇస్తున్నారు. ఇక సరిలేరు నీకెవ్వరు సినిమాకి అనిల్ రావుపూడి డైరెక్షన్ చేస్తుండగా.. మహేష్ సరసన రష్మీక హీరోయిన్ గా నటిస్తోంది.

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -