ప్రస్తుతం టాలీవుడ్ పరిశ్రమలో టాప్ యాంకర్లుగా అనసూయ, రష్మీ లు తమదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఈ ఇద్దరికి ఏ మాత్రం తీసిపోకుండా తమదైన శైలిలో యాంకర్ గా చేస్తూ కొన్ని సినిమాల్లో స్పెషల్ కారెక్టర్ గా చేస్తూ దూసుకెళ్తుంది యాంకర్ శీముఖి. ప్రస్తుతం ఈ టీవీ ప్లస్ లో వచ్చే పటాస్ ప్రోగ్రాం ఎంతగా హిట్ అయిందో, యువత ఆ ప్రోగ్రాం పై ఇంతగా ఆసక్తి చుపిస్తున్నారంటే.. దానికి కారణం యాంకర్ శ్రీముఖి.
అయితే శ్రీముఖి ఎప్పుడు కూడా సినిమాల్లో గ్లామర్ రోల్ పాత్రలో నటించలేదు. ఇప్పటివరకు చేసిన ప్రతి సినిమాల్లో అచ్చ తెలుగు అమ్మాయిలా కనబడింది. అయితే ఇలాంటి శ్రీముఖి కి ఓ మెగా హీరో సినిమాల్లో ఐటెం సాంగ్ ఆఫర్ వచ్చిందట. వరుణ్‌తేజ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో ‘మిస్టర్’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
ఈ చాన్స్ వచ్చిన వెంటనే ముందు సంబర పడ్డ శ్రీముఖి ఆశలపై నీళ్లు చల్లారట దర్శకుడు శ్రీను వైట్ల. అసలు విషయం ఏంటంటే.. ఆరడుగులకంటే పొడుగు ఉండే వరుణ్ పక్కన శ్రీముఖి చాలా పొట్టిగా, చిన్నగా కనబడిందట. ఈ కారణంతో శ్రీముఖిని తప్పించాడట. ఆమె స్థానంలో ‘బాహుబలి’ సినిమాలో ‘మనోహరా..’ పాటలో నటించిన భామను తీసుకున్నట్టు సమాచారం. అంటే ఈ ముద్దు గుమ్మకు ఆరడుగుల కంటే ఎత్తు తక్కువైన హీరో అయితే సరిగ్గా సెట్ అయితాడేమో.
{youtube}Oc9_fbFdJQ4{/youtube}
Related
