Thursday, May 9, 2024
- Advertisement -

వాటి రీమేక్ లు ఎప్పుడో!

- Advertisement -

తెలుగు సినిమాలో కొన్ని క్లాసిక్స్.. ఎప్పుడు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తూనే ఉంటాయి. అలాంటి వాటిలో.. ఇప్పటి తరానికి తెలిసిన కొన్ని సినిమాలు రీమేక్ రేస్ లో ఉన్నాయి. వాటిలో.. ఎన్టీఆర్, ఏఎన్నార్ నటించిన ఆల్ టైమ్ హిట్ గుండమ్మ కథ ఒకటి. ఈ ఇద్దరు మహా నటుల వరుసలో వచ్చిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, అక్కినేని యువ హీరో నాగ చైతన్య తో గుండమ్మకథ మళ్లీ నిర్మిస్తారని ఎప్పటి నుంచో టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

త్రివిక్రమ్ శ్రీనివాస్ అయితే ఈ సినిమాను బాగా హ్యాండిల్ చేస్తాడన్న డిస్కషన్ కూడా నడిచినట్టు టాక్. కానీ.. ఎక్కడ బ్రేక్ పడిందో ఏమో.. ఇప్పటికీ ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు.సూపర్ స్టార్ కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు సినిమాలో.. హీరో క్యారెక్టరైజేషన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రెజెంట్ సూపర్ స్టార్.. కృష్ణ వారసుడు మహేష్ బాబు ఆ సినిమా మళ్లీ చేస్తారని.. చేయాలని ఫ్యాన్స్ తో పాటు మామూలు జనాలు కూడా కోరుకున్నారు.

కానీ.. తనకు సూటవ్వదని మహేష్ అనుకున్నాడో… వేరొకరితో ఈ సినిమా చేయొద్దని కృష్ణ ఫ్యామిలీ డిసైడైందో తెలియదు. చివరికి రీ మేక్ విషయం మాత్రం.. అలాగే మిగిలిపోయింది.రెబల్ స్టార్ కృష్ణంరాజు భక్త కన్నప్పపైనా.. రీమేక్ డిబేట్ నడిచింది. కృష్ణంరాజు సినిమాను రీమేక్ చేస్తే యంగ్ రెబెల్ స్టార్ ప్రభాసే చేయాలన్న డిమాండ్ కూడా వినిపించింది. కానీ ఇదే సబ్జెక్ట్ తో.. సునీల్ ను హీరోగా పెట్టి తనికెళ్ల భరణి సినిమా తీస్తారని ఆ మాధ్య వార్తలొచ్చాయి. ఫైనల్ గా.. ఈ విషయం ఎక్కడిదాకా వచ్చిందో తెలియదు.

చిరంజీవి, శ్రీదేవితో దర్శకేంద్రుడు సృష్టించిన దృష్య కావ్యం.. జగదేక వీరుడు.. అతిలోక సుందరి. రామ్ చరణ్ కచ్చితంగా ఈ సినిమాను మళ్లీ రీమేక్ చేస్తాడని అంతా అనుకున్నారు. తన సినిమాల్లో చిరు పాత పాటల రీ మిక్స్ కూడా చెర్రీకి సెంటిమెంట్ కావడంతో.. చరణే కొత్త జగదేకవీరుడు అవుతాడని ఇప్పటికీ అంతా అనుకుంటున్నారు. బ్రూస్ లీ ఫెయిల్యూర్ తర్వాత.. తమిళ రీమేక్ చేస్తున్న చెర్రీ.. త్వరలోనే తండ్రి క్లాసిక్ పై దృష్టి పెట్టే అవకాశాలు లేకపోలేదు.

ఇక.. ఎన్టీఆర్ క్లాసిక్ నర్తనశాలను… నందమూరి నటసింహం బాలకృష్ణ రీ మేక్ చేయాలని డిసైడై.. ద్రౌపది పాత్రలో సౌందర్యతో షూటింగ్ కూడా మొదలు పెట్టారు. చివరికి అన్నీ అపశకునాలే ఎదురు కావడంతో.. ఆ ప్రాజెక్ట్ పక్కన పెట్టారు. మళ్లీ ఎప్పుడు ఆ సినిమాపై బాలయ్య బాబు దృష్టిపెట్టేదీ తెలియదు.

ఇలాంటి చాలా సినిమాలు.. రీమేక్ అయితే చూడాలని జనాలు కోరుకుంటున్నారు. కానీ.. వాటిపై మన దర్శకులు, యువ హీరోలు ఎప్పుడు కాన్సన్ ట్రేట్ చేసేదీ ఎవరికీ అర్థం కాని పాయింట్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -