Friday, May 10, 2024
- Advertisement -

కృష్ణాలో మ‌రో ప‌డ‌వ ప్ర‌మాదం….

- Advertisement -

ఏపీలో పడవ ప్రమాదాల పరంపర కొనసాగుతూనే ఉంది. కృష్ణా నదిలో చేపలు పట్టేందుకు వెళ్లిన ఒక మత్స్యకార కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. గుంటూరు జిల్లాలో రెండు పడవలు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు.

ఇబ్రహీంపట్నానికి చెందిన మత్స్యకారుడు సైదారాజు చేపలు పట్టేందుకు నదిలో పడవను పెట్టుకుని అక్కడే పడుకున్నాడు. అతడితో పాటు భార్య మాధవి(26), కూతురు కావ్య(6)కూడా శుక్రవారం రాత్రి పడవలోనే పడుకున్నారు. శనివారం తెల్లవారుజామున ఇసుక తవ్వకానికి వచ్చిన డ్రెజ్జర్ బోటు వీరి పడవను బలంగా ఢీ కొట్టింది

దీంతో పడవ బోల్తా పడటంతో సైదారాజు, అతడి భార్యకూతురు కూడా నీళ్లలో పడిపోయారు. వీరిలో సైదారాజుకు ఈత రావడంతో అతడు బయటపడ్డాడు. అయితే అప్పటికి నిద్రలో ఉన్న మాధవి, కావ్యలు మాత్రం నీటి నుంచి బయట పడలేకపోయారు. నీళ్లలో మునిగి ప్రాణాలు విడిచారు. వీరి మృత‌దేహాలు వెలికి తీయడం కూడా కష్టం అయ్యింది.

మృతి చెందిన ఇద్దరినీ ఒడ్డుకు తీసుకువచ్చారు. వీరి మృత దేహాలను చూసి బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. మరోవైపు, ప్రమాదం ఎలా జరిగింది అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -