Friday, April 19, 2024
- Advertisement -

56.5లక్షల టీకా డోసులు.. వెల్లడించిన హర్​దీప్​ సింగ్​ పూరీ..!

- Advertisement -

దేశంలో కరోనాపై పోరాటానికి వ్యాక్సిన్​ ఉద్యమం ప్రారంభమైంది. ఆక్స్​ఫర్డ్​ ‘కొవిషీల్డ్’ టీకాను ఉత్పత్తి చేస్తోన్న సీరం ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా నుంచి మొత్తం 56.5లక్షల టీకా డోసులను వివిధ రాష్ట్రాలకు పంపనున్నట్టు పౌర విమానయాన మంత్రి హర్​దీప్​ సింగ్​ పూరీ తెలిపారు. పుణె కేంద్రంగా.. 13 నగరాలకు ఈ వ్యాక్సిన్​ సరఫరా కానుందని ట్విట్టర్​ వేదికగా ఆయన వెల్లడించారు.

దేశ వ్యాప్తంగా ఈ నెల 16న కొవిడ్​ వ్యాక్సినేషన్​ ప్రారంభం కానుండగా.. తొలివిడతలో భాగంగా పుణె నుంచి ఢిల్లీకి కొవిషీల్డ్​ టీకాను పంపినట్టు తెలిపారు అధికారులు. ఈ మేరకు స్పైస్​జెట్​ ద్వారా.. మొత్తం 34 పెట్టేల్లో 1,088 కిలోగ్రాముల వ్యాక్సిన్​ను.. కట్టుదిట్టమైన భద్రత నడుమ సరఫరా చేశామని పేర్కొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -