Friday, April 26, 2024
- Advertisement -

కరోనా టీకా తీసుకున్న ప్రధాని నరేంద్రమోదీ..!

- Advertisement -

దేశంలో నేడు కరోనా వ్యాక్సిన్ రెండో దశ పంపిణీ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో కరోనా టీకా వేయించుకున్నారు.  ప్రస్తుతం ప్రధాని వయసు 70 సంవత్సరాలు. అందువల్ల 60 ఏళ్లు దాటిన వారి జాబితాలోకి ఆయన వచ్చారు. ఇండియాలో రెండో దశ వ్యాక్సినేషన్‌లో భాగంగా 60 ఏళ్లు దాటిన వారికి… అలాగే… 45 నుంచి 59 ఏళ్ల లోపు వయసు ఉండి దీర్ఘకాల వ్యాధులతో బాధపడేవారికి ఇవాళ్టి నుంచి కరోనా టీకా ఇస్తున్నారు.

మన దేశంలో ఆక్స్‌ఫర్డ్ ఆస్త్రాజెనెకా సృష్టించిన కోవిషీల్డ్ వ్యాక్సిన్, హైదరాబాద్ కంపెనీ భారత్‌ బయోటెక్‌ తయారుచేసిన కోవాగ్జిన్‌కు ఎమర్జెన్సీ వాడకానికి అనుమతి లభించింది. వాటిలో కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ను ప్రధాని మోదీ తీసుకున్నారు. తాను తొలి డోసు వ్యాక్సిన్ పొందినట్లు ప్రధాని మోదీ ట్విటర్‌ ద్వారా తెలిపారు.

బండి బహిరంగ ప్రకటన.. ఇది సవాలే కధ..!

టాలీవుడ్ లో మరో విషాదం!

ఎమ్మెల్సీ కవిత అక్క.. నిజంగానే అక్కగా మారిపోయింది..!

వన్డే, టీ20 సిరీస్ కోసం 17 మందితో మహిళల క్రికెట్ జట్టు ఇదే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -