Wednesday, April 24, 2024
- Advertisement -

కాంగ్రెస్ పీసీసీ చిచ్చు : తన పదవికి మర్రి శశిధర్ రెడ్డి రాజీనామా

- Advertisement -

గత కొంత కాలంగా టీ కాంగ్రెస్ లో అంతర్గత గొడవలు జరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా టీ పీసీసీ ప్రెసిడెంట్ విషయంలో తర్జన భర్జన జరుగుతూ వస్తుంది. మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్ఠానం టీపీసీసీ నూతన అధ్యక్షుడిగా నియమించిన నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రేవంత్ రెడ్డి నియామకం తర్వాత సీనియర్ నేతల్లో నిరుత్సాహం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.

కాకపోతే కొంత మంది అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేక గళం విప్పలేక పోతున్నారు. మరికొంత మంది నిరసన స్వరం వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి టీపీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి పంపించారు.

టీపీసీసీ నూతన అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి పూర్తిగా సహకరిస్తామని శశిధర్ రెడ్డి తెలిపారు. తాను కాంగ్రెస్ పార్టీకి ఎప్పటికీ విధేయుడిగానే ఉంటానని అన్నారు. మొత్తానికి కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయాన్ని బహిరంగంగా విమర్శించే సాహసం చేయనప్పటికీ, తమ అసంతృప్తిని మాత్రం ఏదో ఒక రూపంలో వెళ్లగక్కుతున్నారు.

మంత్రి కేటీఆర్ అపురూప జ్ఞాపకం.. ఫోటో వైరల్

నేటి పంచాంగం,సోమవారం(28-06-2021)

‘ఐకాన్’ తో సుకుమార్ కు భలే చిక్కొచ్చి పడిందే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -