అఖిల ప్రియ భర్త ఎక్కడ ఉన్నాడో తెలిసిపోయింది..!

- Advertisement -

అపహరణ కేసులో సూత్రధారులైన భార్గవ‌రామ్‌, గుంటూరు శ్రీనులు ఉన్న ప్రదేశాన్ని పోలీసులు గుర్తించారు. వారి కోసం ప్రత్యేక బృందాలు మహారాష్ట్ర, కర్ణాటకకు వెళ్లాయి. ఈ నెల 5న ప్రవీణ్‌రావు సోదరులను అపహరించిన వీరిద్దరూ.. మొయినాబాద్‌ ఫాంహౌస్‌కు తీసుకెళ్లి… తెల్లకాగితాలపై సంతకాలు చేయించుకున్నారు. అనంతరం సెల్‌ఫోన్‌లు ఆఫ్‌ చేసి హైదరాబాద్‌ నుంచి పారిపోయారు. కిడ్నాప్‌ వ్యవహారాన్ని పర్యవేక్షించిన భార్గవ‌రామ్‌, గుంటూరు శ్రీను… ప్రవీణ్‌రావు సోదరులను అపహరించిన రోజు కారులోనే ఉన్నారా? ఇంట్లోకి వచ్చి ప్రవీణ్‌రావును తీసుకెళ్లారా అని పోలీసులు పరిశోధిస్తున్నారు.

కిడ్నాప్‌ రోజు వారిద్దరూ ఒకే కారులో ఉన్నారని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు ముందు రోజు వీరిద్దరూ ఒకే కారులో… బంజారాహిల్స్‌, కూకట్‌పల్లి ప్రాంతాల్లో తిరిగినట్లు సీసీ కెమెరాల ద్వారా తెలుసుకున్నారు. ప్రవీణ్‌రావు ఇంటికి వచ్చిన వాహనంలో కాకుండా మరో కారులో వీరిద్దరూ ఉన్నట్లు ఆధారాలున్నా…. వాళ్లు ఇంట్లోకి వెళ్లారా లేదా అనే అంశంపై స్పష్టత రాలేదని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News

- Advertisement -
Loading...