Monday, May 6, 2024
- Advertisement -

యూట్యూబ్‌కు పోటీగా అమెజాన్ ట్యూబ్‌

- Advertisement -

గూగుల్ కు పోటీ లేకపోవడంతో చాలామంది యాడ్ సెన్స్ విషయంలో ఆల్టర్ నేటివ్స్ కు వెళ్లడానికి ఇబ్బందిపడుతున్నారు. దానికి కారణం గూగుల్ చెల్లించినంతగా మిగతా నెట్ వర్క్ లేవి మనీని ఇవ్వకపోవడం. ఈమధ్య ఫేస్ బుక్ కూడా ఎంట్రీ ఇచ్చి తాను కూడా మనీని ఇస్తూ ఉండడంతో కొంతలో కొంత యాడ్ సెన్స్ లను నమ్ముకున్నవారికి న్యాయం జరిగింది.అంటే ఇక్కడ గూగుల్ మోనోపాలి కాకుండా ఫేస్ బుక్ నిలువరించే ప్రయత్నం చేస్తుంది. కాని ఈ ప్రయత్నం యుయస్ ,యుకె,కెనడాలో మాత్రమే ఎక్కువగా అందుబాటులో ఉంది. హాట్ స్టార్ వచ్చింది గాని దాని లెక్కలన్నీ వేరేలా ఉన్నాయి .అది సంస్థలకు తప్ప మనలాంటి కామన్ పీపుల్ కు ఉపయోగపడేది కాదు.

దీంతో యూ ట్యూబ్ కు పోటీ ఇచ్చే మరో దిగ్గజం ఏమొస్తుందా అని అంతా ఎదురుచూస్తున్నారు. ఈ సందర్బంగా మనకు తీపి కబురు అందించడానికి అన్నట్లుగా ఈ-కామ‌ర్స్ దిగ్గజం అమెజాన్ వచ్చేస్తుంది. అవును అమెజాన్ యూట్యూబ్‌కు పోటీగా అమెజాన్ ట్యూబ్‌ అనే పేరుతో సర్వీస్ లను ప్రారంభించ‌నుంది. ఈ సైట్‌లో వీడియో షేరింగ్‌తో పాటు యూజ‌ర్లు ఫోటోలు, టెక్ట్స్ మెసేజ్‌లు, డేటా, ఇత‌ర స‌మాచారాలను షేర్ చేసుకునేలా ఎంతో వీలు క‌ల్పించింది. ఈ విషయాన్ని నిజం చేస్తూ… గూగుల్ తాజాగా అమెజ‌న్‌కు చెందిన ట‌చ్ స్ర్కీన్ ఎకో డివైస్, ఫైర్ టీవీల నుంచి త‌న యూట్యూబ్ యాప్‌ను పూర్తిగా తొల‌గించేసింది. ఈవిధంగా అమెజాన్ సొంతంగా యూట్యూబ్ త‌ర‌హా వెబ్‌సైట్ ప్రారంభించాల‌ని నిర్ణయించుకుంది. అయితే ఈ సర్వీస్ తో కామన్ పీపుల్ కు ఆర్ధికంగా దీని తోడ్పాడు ఏ స్థాయిలో ఉంటుందో చూడాల్సిఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -