Thursday, April 25, 2024
- Advertisement -

గూగుల్ పే స్థానంలో మరో యాప్ ప్రవేశ పెట్టబోతున్న గూగుల్ !

- Advertisement -

ప్రస్తుతం ఈ డిజిటల్ యుగంలో గూగుల్ ఎన్నో సరికొత్త విధానాలను ప్రపంచానికి చేస్తోంది. సర్చ్ ఇంజన్ సంస్థగా ప్రపంచాన్ని శాసిస్తున్న గూగుల్.. మొబైల్ యాప్స్ పరంగా కూడా అగ్రస్థానంలో దూసుకుపోతుంది. ఇప్పటికే ఎన్నో రకాల మొబైల్ యాప్స్ ను యూజర్స్ సౌకర్యార్థం తీసుకువచ్చిన గూగుల్ రాబోయే రోజుల్లో మరిన్ని సేవలను సులభతరం చేసే యాప్స్ ను తీసుకు రానుంది. అయితే ఇప్పటి వరకు గూగుల్ అప్లికేషన్స్ లో డిజిటల్ లావాదేవీల కొరకు ఉపయోగించే యాప్ “గూగుల్ పే ” ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందింది.

అయితే ఇప్పటి ఈ “గూగుల్ పే ” యాప్ ద్వారా ఒకరి నుంచి మరొకరికి మనీ ట్రాన్స్ఫర్ చేయడం, అలాగే మొబైల్ రిచార్జ్, డి‌టి‌హెచ్ రిచార్జ్, ఫ్లైట్ టికెట్ బుకింగ్, ట్రైన్ బుకింగ్, వంటి ఎన్నో సేవలను ప్రవేశ పెట్టింది గూగుల్ సంస్థ. ఇక రాబోయే రోజుల్లో గూగుల్ పే కు అప్డేట్ వర్షన్ గా ” గూగుల్ వాలెట్ ” ను తీసుకురాబోతున్నట్లు సమాచారం. ఈ గూగుల్ వాలెట్ ద్వారా గూగుల్ పే లో ఉండే అన్నీ ఫీచర్స్ తో పాటు.. ఇంకొన్ని ఫీచర్స్ ను కూడా అందుబాటులోకి తీసుకురాబోతుందట. అంతే కాకుండా ప్రైవసీ పరంగా, డేటా సేఫ్టీ పరంగా మెరుగైన భద్రత ఈ ” గూగుల్ వాలెట్ ” యాప్ లో కల్పించనున్నల్టు సమాచారం. ముఖ్యంగా ఎన్ క్రిప్షన్ ప్రొటెక్షన్ కూడా ఈ యాప్ లో ప్రవేశపెట్టబోతున్నారట.

అయితే గూగుల్ వాలెట్ అనేది కొత్తేమీ కాదు గతంలో ఇదే పేరుతో గూగుల్ మొబైల్ అప్లికేషన్ ను ప్రవేశ పెట్టింది. అప్పుడు ఆ యాప్ కు పెద్దగా డౌన్ లోడ్స్ నమోదు కాలేదు ఆ తరువాత ఆ యాప్ పేరు ” తేజ్ ” పేరుతో గూగుల్ ప్రవేశ పెట్టింది. తేజ్ కూడా ప్రజలకు పెద్దగా రిజిస్టర్ కాకపోవడంతో 2018 మరోసారి పేరు మారుస్తూ.. ” గూగుల్ పే ” మార్చారు. ఆ తరువాత డిజిటల్ చెల్లింపుల విషయంలో గూగుల్ పే అత్యధిక డౌన్ లోడ్స్ కలిగిన మొబైల్ యాప్ గా దూసుకుపోతోంది. ఇక రాబోయే రోజుల్లో మరోసారి గూగుల్ పే ను అప్గ్రేడ్ చేసి దాని స్థానంలో ” గూగుల్ వాలెట్ ” ప్రవేశపెట్టబోతున్నట్లు సమాచారం.

More Like This

ఫేస్ బుక్ లో అధిరిపోయే ఫీచర్ !

ఆధార్ హ్యాక్ చేస్తే బహుమతి ఇస్తారట !

క్రిప్టో కరెన్సీ బ్యాన్.. సాధ్యం కదా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -