Saturday, May 18, 2024
- Advertisement -

నెల్లూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ‌…

- Advertisement -
Anam Vivekananda Reddy Meets Bhumana Karunakar Reddy

నెల్లూరు  జిల్లాలో టీడీపీకి మ‌రో ఎదురు దెబ్బ‌త‌గ‌ల‌నుందా..!  జిల్లాలో ఫైర్ బ్రాండ్ ఆనం వివేకానందరెడ్డి, వైకాపాలో చేరనున్నారా? జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆనం వివేకాను ఆకర్షించేందుకువైసీపీ  ఇప్పటికె చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్లు స‌మాచారం. దీంతో నెల్లూరు జిల్లాలో వార్త హాట్ టాపిక్‌గా మారింది.దీంతో టీడీపీ శ్రేణులు ఆందోళ‌న చెందుతున్నారు.అదే జ‌రిగితే టీడీపీకీ కోలుకోలేని దెబ్బ‌త‌గిలిన‌ట్లే.

నెల్లూరు జిల్లాలో ఆనం సోద‌రుల‌గురించి చెప్పాల్సిన ప‌నిలేదు.వారిలో ఆనం వివేక‌నంద‌రెడ్డి గురించి  ఎంత చెప్పుకుంటె అంత త‌క్కువ‌. పైర్ బ్రాండ్‌గా  ఆయ‌న‌కు పేరుంది.ఏవిష‌య‌మైనా ముక్కుసూటిగా మాట్లాడె వ్య‌క్తి. రాజ‌కీయాల్లో శాశ్వ‌త మిత్రులు,శాశ్త‌త శ‌త్రువులు ఎవ‌రూ ఉండ‌రేనిది తెలిసందే. ఇప్పుడు ఆనం వివేకానంద‌రెడ్డి వైసీపీలోకి వెల్లేందుకు సిద్ద‌మ‌యిన‌ట్లు స‌మాచారం.తెలుగుదేశం పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆనం వివేకాను ఆకర్షించేందుకు వైకాపాకు చెందిన కీలక నేత భూమన కరుణాకర్ రెడ్డి రంగంలోకి దిగారు. నెల్లూరులో మరింత బలపడేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న వైకాపా ఎత్తుగడల్లో భాగంగా, రెండు రోజుల క్రితం భూమన స్వయంగా ఫోన్ చేసి ఆనం వివేకాతో మాట్లాడినట్టు తెలుస్తోంది.

వైసీపీలో చేరితే, అందరమూ కలసి పని చేసుకోవచ్చని ఆయన ప్రతిపాదించినట్టు తెలిసింది.దీంతో టీడీపీ శ్రేనుల్లో ఆందోళ‌న మొద‌లైంది. గ‌తంలో ఆనం సోద‌రులు కాంగ్రేస్ పార్టీలో ఒవెలుగు వెలిగిన నేత‌లు. నెల్లూరు జిల్లాలో ప‌ట్టున్న నేత‌లు. టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఆనం సోద‌రులు టీడీపీలో చేరారు.అయితే టీడీపీలో వారికి త‌గినంత ప్రాధాన్య‌త ద‌క్క‌క‌పోవ‌డంతో తీవ్రఅసంతృప్తితో ఉన్నారు.  ఇక టీడీపీలో చేరి 15 నెలలైనా, ఇంతవరకూ ఎటువంటి పదవులు దక్కకపోవడం, తెలుగుదేశం నేతలతో పడక, ఇమడలేక పోతున్నట్టు ఇప్పటికే పలుమార్లు చెప్పిన ఆయన, త్వరలోనే వైకాపా కండువా కప్పుకోవచ్చని భావిస్తున్నారు. ఈ విషయంలో అటు ఆనం సోదరుల నుంచిగానీ, ఇటు వైకాపా నుంచిగానీ ఎటువంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. ఇదే జ‌రిగితే టీడీపీకీ పెద్ద ఎదురుదెబ్బే ….

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. కర్నూలు లో సంచలనం.. కలెక్టర్ కు చుక్కలు చూపించిన వైసీపీ మహిళ ఎమ్మెల్యే
  2. భూమా నాగిరెడ్డి చిన్న కూతురు మౌనికకు నంద్యాల వైసీపీ టికెట్
  3. తండ్రీ,కొడుకులిద్ద‌రికి బ్యాడ్ టైం స్టార్ట్.. టీడీపీకి కష్టకాలం మొదలు..
  4. కర్నూలు లో సంచలనం.. కలెక్టర్ కు చుక్కలు చూపించిన వైసీపీ మహిళ ఎమ్మెల్యే

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -