Saturday, April 20, 2024
- Advertisement -

నేటి నుంచి ఆనందయ్య మందు పంపిణీ..!

- Advertisement -

ఎట్టకేలకు ఉత్కంఠ వీడింది. ఆనందయ్య మందు పంపిణీకి ఉన్న అడ్డంకులు అన్ని తొలగిపోయాయి. నేటి (సోమవారం) నుంచి మందు పంపిణీ చేయబోతున్నట్టు స్వయంగా ఆనందయ్యే ఓ వీడియోను విడుదల చేశారు. రెండు మూడు రోజులుగా ఆనందయ్య మందుపై రాజకీయాలు జరిగిన విషయం తెలిసిందే. ఈ మందును అమ్ముకొనేందుకు కొందరు నేతలు కుట్రలు చేస్తున్నారని.. ఇందుకోసం ఓ వెబ్​సైట్ ను కూడా తయారుచేశారని ఆరోపణలు వచ్చాయి. దీనికి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్​రెడ్డి సైతం కౌంటర్​ ఇచ్చారు.

ఆనందయ్య మందుకు ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే .. ప్రజలు పెద్ద ఎత్తున కృష్ణపట్నం చేరుకుంటున్నారు. మరోవైపు మందు పంపిణీకి ప్రభుత్వం నుంచి సరైన తోడ్పాటు లేదని.. మందు తయారీకి కావాల్సిన ముడి సరుకుల కొరత ఉందని ఆనందయ్య అనుచరులు కొందరు మీడియా ముందు వాపోయారు. ఇదిలా ఉంటే ఆదివారమే ఆనందయ్య సోదరుడు మందు పంపిణీ ప్రారంభించినట్టు సమాచారం. ఈ మేరకు కొన్ని న్యూస్​ చానల్స్​లో వార్తలు కూడా వచ్చాయి.

Also Read: ఆ పాన్ ఇండియా డైరెక్టర్ కు.. ఫస్ట్ టైం రిస్కు తప్పదేమో..

మందుకు కావలసిన ముడి పదార్థాలు సేకరించామని ముందుగా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు మందు పంపిణీ చేసిన తరువాత అన్ని జిల్లాల్లో మందు పంపిణీ చేపడతామని ఆనందయ్య తెలిపారు. మందు కోసం ఎవరు కృష్ణపట్నం రావాల్సిన అవసరం లేదని ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో మందు పంపిణీ జరుగుతుందని ఆయన చెప్పారు. కాగా ఆనందయ్య మందును చిత్తూరు జిల్లా చంద్రగిరిలో తయారుచేస్తున్నారు. అక్కడి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్​రెడ్డి ఈ మందును ఆనందయ్య కుమారుడి ఆధ్వర్యంలో తయారు చేస్తున్నారు.

తన నియోజకవర్గంలోని ఐదు లక్షల ప్రజలకు రెండు రోజుల్లోగా మందు పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే చెవిరెడ్డి తెలిపారు. ఎవరూ మందు కోసం రావాల్సిన అవసరం లేదని తామే ప్రతి ఇంటికి పంపిణీ చేస్తామని ఆయన చెప్పారు. మరోవైపు కృష్ణపట్నానికి ఎవరూ రావొద్దని ఆనందయ్య చెబుతున్నప్పటికీ ప్రజలు మాత్రం పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుంటున్నారు. మొత్తానికి అనేక వివాదాల అనంతరం ఆనందయ్య మందు పంపిణీ ప్రారంభం అవుతోంది.

Also Read: వీళ్లు మారరు.. దెయ్యం పట్టిందని యువకుడిని కొట్టి చంపిన భూతవైద్యుడు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -