Wednesday, May 8, 2024
- Advertisement -

ఇందులోనూ ప్రభుత్వాన్నే నిందిస్తున్నారా..!!

- Advertisement -

తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో ఇటీవలే జరిగిన ఆలయ రథ దగ్ధం విషయం ఇప్పుడు సంచలనం గా మారింది. 57 సంవ‌త్స‌రాల నుండి ఉత్స‌వాల కోసం వినియోగిస్త‌న్న స్వామి వారి ర‌థం శ‌నివారం అర్ధ‌రాత్రి కాలి బూడిదైంది. ప్ర‌త్యేక షెడ్డులో ఉంచిన ర‌థం ద‌హ‌నం కావ‌టంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. దీనిపై ప్ర‌భుత్వం దేవాదాయ శాఖ త‌రుపున విచార‌ణ క‌మిటీని ఏర్పాటు చేయ‌గా, ఇప్ప‌టికే ఈవోపై బ‌దిలీ వేటు వేసింది.

అయితే ఈవిధంగా కావడానికి పూర్తి గా ప్రభుత్వ వైఫల్యమే కారణం అని వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.. సంఘటన స్థలాన్ని పరిశీలించడానికి అంత‌ర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయానికి మంత్రులు వెల్లంపల్లి, విశ్వరూప్‌లు వచ్చారు. అక్కడకు వీరు చేరి ఈ విధంగా వ్యాఖ్యలు చేశారట.. మంత్రుల కాన్వాయ్ కు అడ్డుప‌డి నినాదాలు చేశారు.

ఒక్క‌సారిగా ఏర్ప‌డ్డ ఉద్రిక్త ప‌రిస్థితుల‌తో… పోలీసులు వీహెచ్పీ, భ‌జ‌రంగ్ ద‌ళ్ కార్య‌క‌ర్త‌ల్ని నిలువ‌రించే ప్ర‌య‌త్నం చేసినా వెన‌క్కి త‌గ్గ‌లేదు. దీంతో మంత్రులు స్వ‌యంగా వారితో మాట్లాడి, బాధ్యులపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హామీ ఇవ్వ‌టంతో ఆందోళ‌న విర‌మించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -