Friday, April 19, 2024
- Advertisement -

ఇకనైనా పోలీసులు తమ దూకుడును తగ్గించుకుంటారా…?

- Advertisement -

ఇటీవలే ఆంధ్రప్రదేశ్ లో పోలీసుల దూకుడు గురించి , ప్రజల పట్ల వారు వ్యవహరించే తీరు పట్ల ఎన్నో విమర్శలు ఎదురవుతున్న విషయం అందరికి తెలిసిందే.. అయితే ఆ విషయంలో పోలీసులకు ఇప్పుడు ఎదురవుతున్న వరుస సస్పెన్షన్లు వారిని ఇప్పుడు కలవరపెడుతున్నాయి. చట్టం తన పని తాను చేసుకుపోయే విషయంలో చట్టాన్ని అమలు చేసే పోలీసులకు కూడా చట్టం తన పని తాను చేసుకు పోతుంది.. ప్రజలతో పోలీసులు ఉండే తీరు కూడా మారిపోవడంతో వారికి ఈ శిక్ష పడాల్సిందేనని అంటున్నారు బాధిత ప్రజలు..

అయితే తరచు పోలీస్ పెద్దలు, రాజకీయ నాయకులూ హెచ్చరిస్తున్నా కూడా పోలీసులు తమకు అలవాటైన రీతి లో ప్రవర్తించడంతో వారికి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. సోషల్ మీడియా ను అందరు యూజ్ చేసుకుని ప్రతి ఒక్కరు అన్యాయాల్ని సోషల్ మీడియా లో పెడుతున్న ఈ రోజుల్లో పోలీసులు పాతతరం దురుసు తనాన్ని ప్రవర్తిస్తూ అడ్డంగా బుక్ అయిపోతున్నారు.. సోషల్ మీడియా లో వారి ఆగడాలు అందరు చూశాక , జరగాల్సిందంతా జరిగిపోయాక వారు రియాక్ట్ అవడం దేనికి పనికిరావట్లేదు.. దాంతో చేతులు కాలాక ఆకుల పట్టుకున్నా లాభం లేదనుకుని తాను పని చేసిన స్టేషన్‌లోనే తనపైనే ఎఫ్‌ఐఆర్‌ పడినా ఏమీ చేయలేని స్థితిలో కొంత మంది పోలీసులున్నారు.

ముఖ్యంగా జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక, మద్యం, పేకాట, ఇతర అసాంఘిక కార్యక్రమాలపై ఉక్కుపాదం మోపుతోంది. ఈ క్రమంలో పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. అయితే నిందితుల పట్ల చట్ట పరిధిలో వ్యవహరించాల్సిన ఖాకీలు యథావిధిగా తమ ప్రతాపం చూపుతున్నారు.. దాంతో ఆగ్రహించిన ప్రభుత్వం 53 మంది పోలీసులపై ఎఫ్‌ఐఆర్‌ పడింది. చీరాల, సీతానగరం ఘటనలతో పోలీస్‌ భాస్‌ గౌతం సవాగ్‌ మరోసారి తన సిబ్బందికి ప్రభుత్వం విధానాన్ని చెప్పి క్లాస్‌ పీకారు. దిశ తప్పితే.. దశ ఎలా తిరుగుతుందో కూడా ఇప్పటి వరకూ దశ తప్పిన పోలీసులపై తీసుకున్న చర్యలు, నమోదైన కేసులను గుర్తు చేశారు. మరి ఇప్పటికైనా రక్షక భటులు తమ రక్షణ ను కూడా కాపాడుకుంటారో చూడాలి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -