Friday, May 10, 2024
- Advertisement -

మారని ట్రంప్ బుద్ది…భారత్, పాక్ తో డబుల్ గేమ్

- Advertisement -

ఆర్టికల్ 370 రద్దుతర్వాత భారత్, పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితిలు అలానె కొనసాగుతున్నాయి. అయితే ఈ విషయంలో పెద్దన్న ట్రంప్ మాత్రం ఇరు దేశాలతో డుబుల్ గేమ్ ఆడుతున్నారు. ప్రధాని మోదీ పోన్ చేసినపుడు భారత్ కు అనుకూలంగా..పాక్ ప్రధాని ఇమ్రాన్ ఫోన్ చేసినపుడు ఆ దేశానికి అనుకూలంగా మాట్లాడుతూ మరింత ఉద్రిక్త పరిస్థితులను రెచ్చగొడుతున్నారు. మొదట కశ్మీర్ వివాదాన్ని పరిష్కరించేందుకు మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నానంటూ వ్యాఖ్యానించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఇండియా తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఆతర్వాత కాశ్మీర్ అంశాన్ని ఇరు దేశాలు మాత్రమే పరిష్కరించుకోవాలని చెప్పిన ట్రంప్ న్యూటర్న్ తీసుకున్నారు.

తాజాగా మళ్లీ పాతపాటె పాడుతున్నారు. కశ్మీర్ వివాదాన్ని పరిష్కరించేందుకు మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నానంటూ వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది.కశ్మీర్ ప్రాంతం చాలా సంక్లిష్టమైనది. మీకు హిందువులు ఉన్నారు. ముస్లింలు ఉన్నారు. అయితే రెండు వర్గాలు సంయమనంతో ఉన్నాయని నేను చెప్పలేను. రెండు దేశాలు చాలా కాలంగా కలసికట్టుగా ముందుకు సాగడం లేదనే విషయాన్ని నేను స్పష్టంగా చెప్పగలనన్నారు. నేను మధ్య వర్తిత్వం వహిస్తే సమస్య కొంత వరకు తగ్గవచ్చని వ్యాఖ్యానించారు.

ఇరు దేశాల మధ్య ఎన్నో క్లిష్టమైన సమస్యలు ఉన్నాయని… ఇది అందరికీ తెలిసిన విషయమేనని అన్నారు. ఇరు దేశాల్లో మతం అనేది చాలా క్లిష్టమైన సమస్య అని చెప్పారు. మరో రెండు రోజుల్లో ఫ్రాన్స్ వేదికగా జరగనున్న జీ7 దేశాలో సమావేశంలో ఈ అంశంపై మోదీ వద్ద ప్రస్తావించనున్నట్టు తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -