Friday, May 10, 2024
- Advertisement -

పెళ్లాంమీద కోపంతో విమానాన్ని హైజాక్ చేయాల‌ని చూసిన ఘ‌నుడు

- Advertisement -

బంగ్లాదేశ్‌లో విమానం హైజాక్ క‌ల‌క‌లం రేపింది. పెళ్లాం మీద కోపంతో 148 ప్రయాణిస్తున్న ఓ విమానాన్ని హైజాక్‌ చేసేందుకు ప్రయత్నించాడు. ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో హైజాకర్ తీవ్రంగా గాయపడి చనిపోయాడు. అయితే దీని వెనుక ఎలాంటి ఉగ్ర‌కోణంలేద‌ని అక్క‌డి అధికారులు తెలిపారు.

వివ‌రాల్లోకి వెల్తే..ఆదివారం మధ్యాహ్నం ఓ దుండగుడు బిమాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాన్ని హైజాక్ చేసేందుకు ప్రయత్నం చేశాడు. 148 మంది ప్రయాణికులతో బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకా నుంచి దుబాయ్‌ వెళ్తున్న బంగ్లాదేశ్‌ ఎయిర్‌లైన్‌ విమానాన్ని మార్గమధ్యంలో దారి మళ్లించేందుకు ప్ర‌య‌త్నించాడు. విమానం బ‌య‌ల్దేరిన కాసేప‌టికే ఓ ప్ర‌యాణీకుడు కాక్‌పిట్‌లోకి చొర‌బ‌డి త‌న ద‌గ్గ‌ర బాంబు ఉందంటూ బెదిరింపుల‌కు దిగాడు. పైలెట్లు అత్య‌వ‌స‌రంగా విమానాన్ని చిట్టగాంగ్ విమానాశ్రయంలో దింపారు. ఎయిర్‌పోర్టులో హైజాకర్‌తో అధికారులు చర్చలు జరిపారు. నాకు.. నాభార్యతో గొడవలున్నాయని, ఈ విషయం మీద బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనాతో వెంటనే మాట్లాడాలని హైజాకర్.. పదేపదే డిమాండ్‌ చేసినట్లు అధికారులు తెలిపారు.ముందు ప్రయాణికుల్ని విమానం నుంచి దింపేయాలని అధికారులు అతడికి విజ్ఞ‌ప్తి చేయడంతో ఒప్పుకున్నాడు. అత్య‌వ‌స‌ర ద్వ‌రాం నుంచి ప్ర‌యాణీకుల‌ను కింద‌కు దింపారు. ఆ తర్వాత..లొంగిపోవాలని హైజాకర్‌ను హెచ్చరించిన.. వినకపోవడంతో అతనిపై కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు. అయితే..ఆ కాల్పుల్లో నిందితుడు మరణించాడు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -